Telugu News » Tag » Ipl
IPL

Ipl వార్తలు

    ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (IPL) కు తొలి బీజం 2007 లో పడింది. ఏప్రిల్ 2008 లో బీసీసీఐ (BCCI) దీన్ని ప్రారంభించింది. ఐపీఎల్‌-2022లో (IPL 2022) మొత్తం 10 జట్లు టైటిల్‌ పోరులో తలపడనున్నాయి. ఐపీఎల్ బరిలోకి కొత్తగా అహ్మదాబాద్ (IPL Ahmedabad Team), లక్నో (IPL Lucknow Team) జట్లు వచ్చి చేరాయి. రూ.7,090 కోట్లు చెల్లించి లక్నో జట్టును RPSG గ్రూప్‌ దక్కించుకుంది.  అహ్మదాబాద్‌ జట్టుకు సీవీసీ కేపిటల్‌ పార్ట్‌నర్స్‌ రూ.5,625 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది.

    చెన్నై సూపర్‌ కింగ్స్‌ (Chennai Super Kings), ఢిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals), కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (Kolkata Knight Riders), ముంబై ఇండియన్స్‌ (Mumbai Indians), పంజాబ్‌ కింగ్స్‌ (Punjab Kings), రాజస్థాన్‌ రాయల్స్‌ (Rajastan Royals), రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (Royal Challengers Bangalore), సన్‌రైజర్‌ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad) లు ఉండగా, కొత్తగా అహ్మదాబాద్‌, లక్నో జట్లు వచ్చి చేరాయి.

    గత ఐపీఎల్‌ సీజన్స్‌లో కొన్ని జట్లు అలా వచ్చి ఇలా వెళ్లిపోయాయి. వాటిలో డెక్కన్‌ ఛార్జర్స్‌ 2008 నుంచి 2012 వరకు కొనసాగింది. కోచి టస్కర్స్‌ 2011లో నిష్క్రమించింది. పుణె వారియర్స్‌ 2011 నుంచి 2013 వరకు, రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్‌ 2016 నుంచి 2018 వరకు, గుజరాత్‌ లయన్స్‌ 2016 నుంచి 2018 వరకు ఆయా సీజన్స్‌లో ఆడి తర్వాత నిష్క్రమించాయి.

    2008 లో ప్రారంభమైన ఈ లీగ్ ఇప్పటివరకు 14 సార్లు జరిగింది.
    ముంబై ఇండియన్స్ – 5
    చెన్నై సూపర్ కింగ్స్ – 4
    కోల్ కతా నైట్ రైడర్స్ – 2
    రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, డెక్కన్ ఛార్జర్స్ – ఒక్కోసారి

    విజేత ప్రైజ్ మనీ రూ. 20 కోట్లు
    రన్నరప్ – రూ. 12.50 కోట్లు

    ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ కి ఆరెంజ్ కప్ దక్కుతోంది. అలాగే, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కు పర్పుల్ క్యాప్ దక్కుతోంది.