రాష్ట్రంలో 51 ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందిస్తుందన్న సీఎం జగన్.. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్‌రెడ్డిలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల్లో వేగంగా పనులు, భూసేకరణతో పాటు అన్ని అంశాల్లో వేగంగా నిర్ణయాలు తీసుకున్నామని.. రాష్ట్రంలో మిగిలిన రహదారుల పనులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని వ్యాఖ్యానించారు.