హన్సిక తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన ముద్దుగుమ్మ. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన దేశ ముదురు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ తర్వాత ప్రభాస్, రామ్ పోతినేని, సిద్ధార్థ వంటి హీరోలతో సినిమాల్లో నటించింది. గత కొన్నాళ్లుగా హన్సిక తెలుగు సినిమాల్లో కనిపించలేదు. చివరిసారిగా సందీప్ కిషన్ తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ సినిమాలో నటించింది.
డిసెంబర్ 4న జైపూర్ సమీపంలోని ముండోటా ఫోర్ట్ అండ్ ప్యాలెస్లో హన్సిక మోత్వాని, సోహైల్ ఖతురియా ఈ జంట పెళ్లి సింధీ సంప్రదాయ వేడుకలో జరిగింది. కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో ఈ స్టార్ కపుల్ ఒక్కటయ్యారు. రెడ్ కలర్ వర్క్ లెహెంగాలో హన్సికా,సిల్వర్, వైట్ కలర్ షెర్వానీలో సోహైల్ కలర్ఫుల్గా తయారయ్యారు
తాజాగా వీరి పెళ్లి ఫోటోలు , వీడియోలు వైరల్ అవ్వడమే కాకుండా పెళ్లి దుస్తులలో హన్సిక, సోహైల్ దంపతులను చూసి అభిమానులు ముచ్చట పడిపోతున్నారు. ఈ జంటకు మ్యారేజ్ విషెస్ చెబుతున్నారు. పెళ్లి కార్యక్రమం ముగిసిపోవడంతో.. ఇప్పుడు హన్సిక హనీమూన్ గురించిన విషయాలు తెలుసుకోవడానికి ఆమె అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు.