ఈ అద్భుత గాజు వంతెన విదేశాల్లో కాదు.. బీహార్‌లో ఉంది.. ఫొటోలు చూడండి
ఈ అద్భుత గాజు వంతెన విదేశాల్లో కాదు.. బీహార్‌లో ఉంది.. ఫొటోలు చూడండి
చైనా గ్లాస్ వంతెన ప్రపంచంలోనే అతి పెద్దది. దాన్ని చూడటానికి ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు ప్రత్యేకంగా చైనా వెళ్తారు. ఇప్పుడు భారతదేశంలో అదే తరహాలో ఒక గాజు వంతెనను నిర్మించారు. దాని అందం, విశాల దృశ్యం... చైనా గాజు వంతెన కంటే చాలా ఎక్కువ. భారతదేశంలోని ఈ గాజు వంతెనను... బీహార్.. నలంద జిల్లాలో నిర్మించారు. (Photos - Abhishek Kumar)
అద్దాల వంతెనను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు చేరుకుంటున్నారు. 40 మంది వ్యక్తులు ఏకకాలంలో సులభంగా నడవగలిగేలా దీన్ని చాలా బలంగా తయారు చేయాపు. ఈ గ్లాస్ బ్రిడ్జి పైకి ఎక్కిన తర్వాత గాలిలో నడుస్తున్నట్లు అనిపిస్తుంది.
2/ 8
గాజుతో చేసిన ఈ బ్రిడ్జి మీద నుంచి కిందకి చూస్తే, మనం ఆకాశంలో ఉన్నామా, కాళ్ల కింద నేల లేదు, ఇప్పుడు కింద పడిపోతామా అనిపిస్తుంది. గ్లాస్ బ్రిడ్జ్ ఎత్తు భూమి నుంచి 200 అడుగులు. ఇది దాదాపు 6 అడుగుల వెడల్పు ఉంది.
3/ 8
బీహార్.. నలంద జిల్లాలోని ఈ రాజ్‌గిర్ గ్లాస్ బ్రిడ్జ్‌ని... చైనాలోని హాంగ్జౌ తరహాలో నిర్మించారు. ప్రపంచంలో ఎంపిక చేసిన కొన్ని ప్రదేశాలలో మాత్రమే ఇంత భారీ గాజు వంతెనలు ఉన్నాయి. రాజ్‌గిర్ గ్లాస్ బ్రిడ్జ్ భారతదేశంలో రెండో గాజు వంతెన.
4/ 8
ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సారధ్యంలో నిర్మించిన ఈ గాజు వంతెన.. దానికదే ప్రత్యేకమైనది. చైనా, అమెరికా మాదిరిగానే, ఈ గాజు వంతెనను ముఖ్యమంత్రి మార్చి 27, 2021న ప్రారంభించారు. ఆ తర్వాత పర్యాటకుల కోసం తెరచివుంచారు.
5/ 8
రాజ్‌గిర్ చేరుకోవడం చాలా సులభం... పాట్నా నుంచి టాక్సీ లేదా బస్సులో రాజ్‌గిర్ చేరుకుని గ్లాస్ బ్రిడ్జిని సందర్శించవచ్చు. పాట్నా నుంచి ట్రావెల్ కోసం రూ.100 ఖర్చు అవుతుంది. చుట్టూ పర్వత లోయలు, నలంద అడవులతో ఉన్న అందమైన గాజు వంతెనను పర్యాటకులు ఎంతగానో ఆస్వాదించవచ్చు.
6/ 8
ఈ గాజు వంతెనపై ప్రయాణించడానికి మీరు రూ.200 ఖర్చు చేయాలి. ఇందులో గ్లాస్ బ్రిడ్జి ఉన్న ప్రదేశానికి వెళ్లేందుకు రూ.50 ప్రవేశ రుసుము, ఈ వంతెన పైన నడిచేందుకు రూ.150 చెల్లించాల్సి ఉంటుంది.
7/ 8
ఈశాన్య భారతదేశంలోని మొదటి గాజు వంతెన అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన రాజ్‌గిర్‌లో ఉంది. రాజ్‌గిర్ గ్లాస్ బ్రిడ్జికి వెళ్లాలంటే మీరు Rajgirzoosafari.in కి వెళ్లి టిక్కెట్లను బుక్ చేసుకోవాలి.
8/ 8
టికెట్ కొన్న తర్వాత మీరు ఈ గాజు వంతెనపై 2 గంటల పాటు ఉండి ఆస్వాదించవచ్చు. చైనాలో వంతెనతో పోల్చితే దీని టికెట్ ధర చాలా తక్కువ. అందుకే ప్రజలు దీన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. టూరిస్టులకు ఇది సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారింది.