మలయాళీ భామ కీర్తి సురేష్ ఇటీవలే నటించిన మూవీ సర్కారు వారి పాట. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటించిన ఈ సినిమా అనేక వాయిదాల తర్వాత భారీ అంచనాల నడుమ మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. యువ దర్శకుడు పరుశురామ్ పెట్లా దర్శకత్వం వహించగా.. కీర్తి సురేష్ హీరోయిన్గా చేశారు. థమన్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. Photo : Instagram
తాజాగా ఇటీవల సైలెంట్ గా కీర్తి సురేష్ కుటుంబ సభ్యులు పెళ్లి పనులు మొదలు పెట్టినట్లుగా కొన్ని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అందుకే ఇటీవల వారు సంప్రదాయం ప్రకారం కేరళలోని కొన్ని పుణ్యక్షేత్రాలు కూడా సందర్శించినట్లుగా తెలుస్తోంది. కీర్తి సురేష్ ఇటీవల వల్ల కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.
కీర్తి సినిమాల విషయానికి వస్తే... ఆమె చిరంజీవి సినిమాలో కూడా నటిస్తుంది. (Bhola Shankar )భోళా శంకర్ అనే సినిమాలో కీర్తి సురేష్.. చిరంజీవికి చెల్లెలుగా కనిపించనుంది. ఈ సినిమా తమిళ సినిమా వేదాళంకు తెలుగు రీమేక్‌గా వస్తోంది. మెహెర్ రమేష్ దర్శకుడు. రాఖీ పండుగ సందర్భంగా ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్లు రీవిల్ చేసింది చిత్రబృందం. ఇక అది అలా ఉంటే కీర్తి సురేష్ ఓ హిందీ సినిమా తెలుగు రీమేక్’లో నటించనుందని తెలిసింది. Photo: Instagram