YouTuber : వయసు 23 ఏళ్లే.. 7 లగ్జరీ హౌస్‌లు కొనేసింది
YouTuber : వయసు 23 ఏళ్లే.. 7 లగ్జరీ హౌస్‌లు కొనేసింది
YouTuber : ఐదేళ్లలో ఆమె ప్రపంచవ్యాప్తంగా గొప్ప కంటెంట్ క్రియేటర్‌గా ఫేమస్ అయ్యింది. భారీగా డబ్బు సంపాదించింది. పాతికేళ్ల వయసు కూడా లేదు.. అప్పుడే రియల్ ఎస్టేట్‌లో దూసుకుపోతోంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
యూట్యూబ్‌ని సరిగ్గా వాడుకుంటే.. కోట్లు సంపాదించవచ్చు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ 23 ఏళ్ల లిన్సీ డొనొవాన్ (Linsey Donovan). లగ్జరీ లైఫ్‌స్టైల్‌ని అనుభవించాలని కలలుకన్న ఆమె.. ఐదేళ్లలో కల సాకారం చేసుకుంది. (image credit - instagram - linsey99forever)
2/ 12
డబ్బు సంపాదించడమే లక్ష్యంగా కష్టపడిన లిన్సీ.. తన హార్డ్ వర్క్ కచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుందని బలంగా నమ్మింది. ఆ ఫలితాలను ఇప్పుడు అనుభవిస్తోంది. (image credit - instagram - linsey99forever)
3/ 12
ఇవాళ ఆమె ప్రముఖ కంటెంట్ క్రియేటర్ మాత్రమే కాదు. మల్టీ మిలియన్ డాలర్ల రియల్ ఎస్టేట్ పోర్టిఫోలియాకి ఓనర్ కూడా. ఒక మోడల్‌గా, యూట్యూబర్‌గా ఆమె విజయవంతంగా దూసుకుపోతోంది. (image credit - instagram - linsey99forever)
4/ 12
18 ఏళ్ల వయసులోనే ప్రారంభించింది లిన్సీ. ఇంట్లోంచీ బయటకు వెళ్లిపోయి.. తన కాళ్లపై తాను నిలబడాలని నిర్ణయించుకుంది. అనుకున్నట్లే చేసింది. ఫలితంగా ఇప్పుడు ఆమె 7 లగ్జరీ ఇళ్లకు ఓనర్ అయ్యింది. (image credit - instagram - linsey99forever)
5/ 12
అమెరికా.. మేరీలాండ్ నివాసి అయిన లిన్సీ.. 17 ఏళ్ల వయసు నుంచి వీడియోలు చెయ్యడం మొదలుపెట్టింది. వాటి నుంచి వచ్చే మనీనీ జాగ్రత్తగా ఖర్చు పెడుతూ.. మోడలింగ్ కెరీర్లోకి అడుగుపెట్టింది. (image credit - instagram - linsey99forever)
6/ 12
మోడలింగ్‌లో చేసిన ప్రతీ అసైన్మెంట్కీ రూ.50 వేల చొప్పున తీసుకుంటూ.. ఆ డబ్బును కూడా దాచుకోవడం మొదలుపెట్టింది. ఇలా కొన్నేళ్లకే మిలియనీర్ అయ్యింది. (image credit - instagram - linsey99forever)
7/ 12
19 ఏళ్ల వయసులో మొదటి ఇల్లు కొన్న లిన్సీ.. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వైపు దృష్టి సారించింది. అనుకున్న వెంటనే అందులో లోటుపాట్లన్నీ వేగంగా తెలుసుకుంది. తర్వాత తనే పెద్ద ఇన్వెస్టర్ అయిపోయింది. (image credit - instagram - linsey99forever)
8/ 12
ఈ రోజున ఆమె చాలా ఇళ్లు, స్థలాలు కొంటోంది, అమ్ముతోంది. తద్వారా భారీగా లాభాలు సాధిస్తోంది. ఆమె కొనుక్కున్న ఇళ్లన్నీ కోట్ల రూపాయల విలువ చేసేవే. (image credit - instagram - linsey99forever)
9/ 12
మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన లిన్సీకి డబ్బు విలువ బాగా తెలుసు. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 45 వేల మంది దాకా ఫాలోయర్స్ ఉన్నారు. (image credit - instagram - linsey99forever)
10/ 12
లిన్సీ తన లగ్జరీ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన ఫొటోలూ, వీడియోలను తరచూ ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తోంది. అలాగే కొన్ని లగ్జరీ హౌస్‌ల ఫొటోలు కూడా పోస్ట్ చేస్తోంది. మరో విషయం ఏంటంటే.. ఆమె ఓ జూని కూడా కలిగివుంది. (image credit - instagram - linsey99forever)
11/ 12
కలల్లో తేలియాడే వాళ్లలా కాకుండా.. ఆ కలలను సాకారం చేసుకొని ఎంతో మందికి లిన్సీ ప్రేరణగా నిలుస్తోంది. ఆమె లాగా తమ లక్ష్యాలను చేరుకోవాలని యూత్ కోరుకుంటోంది. (image credit - instagram - linsey99forever)