Viral Pics : మీ కంటికి పరీక్ష.. మొదటి చూపులోనే ఈ ఫోటోల్ని మీరు అర్ధం చేసుకోవడం కష్టమే సుమీ..
Viral Pics : మీ కంటికి పరీక్ష.. మొదటి చూపులోనే ఈ ఫోటోల్ని మీరు అర్ధం చేసుకోవడం కష్టమే సుమీ..
Viral Pics : సోషల్ మీడియాలో చాలా రకాల ఫోటోలు షేర్ అవుతున్నాయి. వీటిలో ఆప్టికల్ ఇల్యూజన్ నుండి కన్ఫ్యూజింగ్ ఫోటోల వరకు ఉన్నాయి. ప్రజలు సోషల్ మీడియాలో గందరగోళ చిత్రాలను చూడటానికి ఇష్టపడతారు. ఈ చిత్రాలు చాలా ఫన్నీగా ఉన్నాయి. నిజానికి ఈ ఫోటోల్ని అర్ధం చేసుకోవడానికి ఎవరికైనా సరే టైం పట్టడం ఖాయం. అలాగే ఈ, ఫోటోలు చూడగానే ఒక్కోసారి డబుల్ మీనింగ్ ఫోటోలు గుర్తుకు వస్తాయి. కానీ నిజానికి ఇవి క్లీన్ పిక్చర్స్ మాత్రమే.
1/ 11
ఈ ఫోటోని చూసి వామ్మో.. ఈ కుక్కకి ఇంత జట్టు ఉందా అని అనుకుంటున్నారా..? అయితే, మీరు పప్పులో కాలు వేసినట్టే. మరొక కుక్క తోక వెనుక నుంచి తీసి ఫోటో ఇది. ఇందులో రెండు కుక్కలు ఉన్నాయ్.
2/ 11
ఇది ఏంట అబ్బా.. వెయిటర్ అమ్మాయి బట్టలు వేసుకున్నాడేంటి అనుకుంటున్నారా..? సరిగ్గా చూడండి. ముందు ఉన్న గ్లాస్ లో ఆ అమ్మాయి రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల ఇలాంటి గందరగోళం ఏర్పడింది.
3/ 11
వామ్మో.. ఏంది ఈ పిల్లి ఇంత పెద్దగా ఉందని మీరు ఆశ్చర్యపోవడం మాములే. కానీ.. మీరు దగ్గరగా చూస్తే అసలు నిజం తెలుస్తోంది. నిజానికి ఇక్కడ ఉంది ఒక పిల్లి కాదు.. రెండు పిల్లలు. అవి, ఒకే రంగులో ఉండటం వల్ల ఇలా కన్ఫ్యూజ్ పెరుగుతోంది.
4/ 11
మీరు ఎప్పుడైనా కొమ్ముల పిల్లిని చూశారా? అలాగే.. దానికి పెద్ద చెవుల్ని ఉండటం చూశారా..? కాదు కాదు? సరైన సమయంలో తీసిన ఈ ఫోటోలో కనిపించే కొమ్ము పిల్లి వెనుక ఉంచిన దిండులో ఉంది.
5/ 11
ఇది ఏంటి.. ఇదేదో వింత జీవిలా ఉంది. కుక్క తల.. మానవ శరీరం ఇలాంటి వింతను ఎప్పుడు చూడలేదు. ఇది కచ్చితంగా మార్ఫింగ్ ఫోటో అనుకుంటున్నారా..? కాదండీ.. ఇది రియల్ ఫోటోనే. అయితే, ఈ ఫోటోలో మహిళ తల వెనక ఉంది. కుక్క తల ముందుకు ఉంది. ఇలా ఉండటం వల్ల ప్రజలు ఒక్కసారిగా అయోమయంలో పడ్డారు.
6/ 11
పెళ్లి తర్వాత అకస్మాత్తుగా అమ్మాయి శరీరం యొక్క దిగువ భాగం ఎలా అదృశ్యమైంది? లేదు లేదు వధువు డ్రెస్ బ్యాక్ గ్రౌండ్ తో మ్యాచ్ అయింది. దీంతో.. ప్రజలంతా తికమక పడుతున్నారు.
7/ 11
వామ్మో ఈ ట్రక్ బాహుబలిలా ఉంది. ఇది, నిజంగా ఇంత పెద్ద వస్తువుల్ని తీసుకువెళుతుందా? మరోసారి చిత్రాన్ని చూడండి. అసలే ఇది ట్రక్కు పైభాగం కాదు, వెనుక ఉన్న బిల్డింగ్, పర్ఫెక్ట్ టైమింగ్ ఫోటో చూసి ట్రక్కులో లోడ్ చేసినట్లు భ్రమ కలిగిస్తోంది.
8/ 11
అమ్మాయి కారు నడుపుతున్నట్లు మీకు అనిపిస్తే, ఈ ఫోటోను మళ్లీ చూడండి. నిజానికి బ్యాక్ పోస్టర్లో ఉన్న అమ్మాయి ఫోటోతోనే అలాంటి భ్రమలు కలుగుతున్నాయి. కారు ఖాళీగా పార్క్ చేయబడింది.
9/ 11
మేము ఏమి ఆలోచిస్తున్నామో మీరు కూడా అదే ఆలోచిస్తున్నారా? లేదు, ఈ ఫోటోలో ఇద్దరు వ్యక్తులు ఇందులో చేతులు కలపలేదు. మధ్యలో నిలబడిన స్త్రీ చేతులు జోడించి అలా నిలబడి ఉంది. దీంతో.. తికమక ప్రారంభమైంది.
10/ 11
చాలా మందికి ఈ ఫోటో పక్షి తీస్తున్నట్లు అనిపిస్తుంది. అయితే వాస్తవం ఏమిటంటే, ఓ వ్యక్తి తన చిత్రాన్ని గాజు వెనుక నుండి తీసుకుంటున్నాడు.
11/ 11
బాప్ రే ఇంత పొడువు ఉన్న ఆవునా..? లేదండి.. ఇది కూడా పిల్ల లాంటి కేసే. భవనం వెనుక రెండు ఆవులు నిలబడి ఉన్నాయ్. కానీ.. ఒకటే అనే భ్రమ మాత్రం మనకు కలుగుతోంది.