Free biryani offer: మీకు ఆకలిగా ఉందా.. అయితే ఇక్కడికి వచ్చి ఫ్రీగా బిర్యానీ తినండి.. అదెక్కడో తెలుసుకోండి..

Free biryani offer: కరోనా మహమ్మారి కారణంగా ఆర్థికంగా నష్టపోయిన వారు మళ్లీ మామూలు స్థితికి వస్తున్న క్రమంలో సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చుతుంది. ఇప్పటికే చాలామంది ఉపాధి, ఉద్యోగాలను కోల్పోయి రోడ్డున పడ్డారు. కూలీ పనులకు వెళ్లే వారి పరిస్థితి ఇంకా దారుణంగా తయారయింది. కార్మికులకు పనులు లేక ఒక పూట తింటూ మరో పూట పస్తులు ఉంటున్నారు. అయితే ఈ సమయంలో వారి ఆకలిని తీర్చేందుకు ఓ మహిళ ముందుకొచ్చింది. ఆకలేస్తుందని చెప్పగానే అమ్మలా అన్నం పెడుతుంది.