Photos : తనను తాను పెళ్లి చేసుకుంది.. 24 గంటల్లో విడాకులు కోరింది.. ఎందుకిలా?
Photos : తనను తాను పెళ్లి చేసుకుంది.. 24 గంటల్లో విడాకులు కోరింది.. ఎందుకిలా?
పెళ్లెందుకు చేసుకోవడం, ఎందుకు విడాకులు కోరుకోవడం... ఈ రోజుల్లో కొంతమంది ఏం చేస్తున్నారో వాళ్లకే తెలియట్లేదు. పబ్లిసిటీ స్టంట్ కోసమే ఇలా చేస్తున్నారా? ఆ యవతి కథేంటో తెలుసుకుందాం. (All images credit - twitter - @sofimaure07)
ఆమె పేరు సోఫీ మారే (Sofi Maure). అర్జెంటినా యువతి. ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈమె ఫిబ్రవరిలో ట్విట్టర్లో పెట్టిన ఓ ట్వీట్.. చర్చకు దారి తీసింది. తనను తాను పెళ్లి చేసుకుంటున్నట్లు మారీ తెలిపింది.
2/ 9
ఆ ట్వీట్లో మారీ వెడ్డింగ్ డ్రెస్లో ఉంది. తలపై పూల కిరీటంతో.. సెల్ఫీ తీసుకుంది. గోల్డ్ తియారా ధరించింది. అందువల్ల ఆమె.. తనను తాను నిజంగానే పెళ్లి చేసుకుందని అనుకోవచ్చు.
3/ 9
"ఈ రోజు, నా జీవితంలో అత్యంత గొప్పది. నేను పెళ్లి కోసం పెళ్లి డ్రెస్ కొనుక్కున్నాను. వివాహ కేకును వండుకున్నాను. నన్ను నేను పెళ్లి చేసుకుంటున్నాను" అని ఫిబ్రవరి 20న ట్వీట్ చేసింది.
4/ 9
ఆ ట్వీట్ చూసి చాలా మంది రియాక్ట్ అయ్యారు. చెప్పాలంటే చాలా మంది ఆశ్చర్యపోయారు. నిన్ను నువ్వు పెళ్లి చేసుకోవడమేంటి?.. అని కొందరు ప్రశ్నిస్తే.. నీకేం తక్కువ.. నిన్ను చేసుకోవడానికి ఎవరూ లేరా? అని మరికొందరు ప్రశ్నించారు.
5/ 9
ఓ రోజంతా రకరకాల కామెంట్స్ వచ్చాక... ఫిబ్రవరి 21న మారే.. మరో రకమైన ట్వీట్ పెట్టింది. తాను విడాకులు తీసుకోవాలి అనుకుంటున్నట్లు తెలిపింది.
6/ 9
"అప్డేట్: నేను పెళ్లి చేసుకొని ఒక రోజు కూడా కాలేదేమో... నేను దీన్ని భరించలేకపోతున్నాను. విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను. నా విషయంలో డైవర్స్ ఎలా తీసుకోవాలో" అని ట్వీట్ చేసింది.
7/ 9
ఈ ట్వీట్ సోషల్ మీడియాలో మళ్లీ హాట్ టాపిక్ అయ్యింది. చాలా మంది షాక్ అయ్యారు. "నువ్వు వెంటనే ఓ లాయర్ని కలువు" అని ఓ యూజర్ కామెంట్ ఇచ్చారు. "విడాకులు తీసుకున్నాక.. నన్ను పెళ్లి చేసుకో" అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు.
8/ 9
"బుద్ధి లేని తనానికి పరిమితి లేదు. దీని నుంచి ఎక్కువ అంచనాలు పెట్టుకోకండి. ఇలాంటి వాళ్లు అసహ్యకరం" అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు. "అందుకే పెళ్లి చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి" అని మరో యూజర్ కామెంట్ రాశారు.
9/ 9
ఇలా సోఫీ... వైరల్ అయ్యింది. ఆమె ఎందుకిలా చేసిందో ఎవరికీ అర్థం కాలేదు. పబ్లిసిటీ స్టంటే ఇది అని చాలా మంది అభిప్రాయపడ్డారు.