చేతిలో డబ్బు లేకపోయినా.. వస్తువులు కొనేందుకూ, మనీ అవసరాలు తీర్చేందుకు వీలు కల్పించేది క్రెడిట్ కార్డ్. అవసరానికి వాడుకున్న ఆ డబ్బును మెల్లగా చెల్లించే వీలు ఉంటుంది. ఐతే.. చాలా మంది తిరిగి చెల్లించే విషయంలో ఇబ్బంది పడుతుంటారు. దాంతో... వడ్డీ విపరీతంగా పడి.. క్రెడిట్ కార్డు ఎందుకు వాడామా అని బాధపడే పరిస్థితి ఉంటుంది. ఐతే.. యూరప్‌లో జర్మనీ పక్కనే ఉన్న నెదర్లాండ్స్ దేశంలో ప్రజలు క్రెడిట్ కార్డును దాదాపు వాడరు. (Image: AP)
నెదర్లాండ్స్‌లో బ్యాంకింగ్ వ్యవస్థ బాగా డెవలప్ అయ్యింది. డాలా మంది ఆన్లైన్ బ్యాంకింగ్ సేవల్ని వాడుకుంటారు. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు ఎక్కువగా ఆన్లైన్లో జరుగుతాయి. అందువల్ల వారికి రకరకాల ఎలక్ట్రానిక్ పేమెంట్ పద్ధతులు ఉన్నాయి. వాటిలో iDeal అనేది ఒకటి. దీని ద్వారా ప్రజలు తమ బ్యాంక్ అకౌంట్స్ నుంచి నేరుగా ఆన్లైన్ పేమెంట్స్ జరపవచ్చు. (Image: AP)
నెదర్లాండ్స్‌లో క్రెడిట్ కార్డులు వాడేందుకు కొన్ని కండీషన్స్ ఉన్నాయి. కస్టమర్లను కాపాడేందుకే ఇవి ఉన్నాయి. ఇష్టమొచ్చినట్లు వాడేసి.. ప్రజలు అప్పులపాలు కాకూడదనే ఉద్దేశంతో అక్కడి ప్రభుత్వం రెగ్యులేషన్స్ విధించింది. వాటి ప్రకారం.. క్రెడిట్ కార్డుపై వడ్డీ రేట్లను ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. క్రెడిట్ కార్డు కంపెనీలు.. పెనాల్టీలు, రహస్య ఫీజ్ (hidden fees) వంటివి వేసే ఛాన్స్ లేదు. (Image: File Photo)