కుక్కలు సాధారణంగా చాలావరకు మనుషులతో స్నేహంగా ఉంటాయి. కానీ అకస్మాత్తుగా అవి కారులో కూర్చున్న వ్యక్తులకు బద్ధ శత్రువులుగా మారతాయి. చాలాసార్లు కుక్కలు తన శక్తినంతా ఉపయోగించి కార్ల వెనుక పరుగెడుతుంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, వాస్తవానికి వాటి శత్రుత్వం మీతో కాదు..మీ యొక్క టైర్లపై వాసన వదిలిన ఇతర కుక్కలతో ఉంటుంది. అవును, కుక్కల వాసనా శక్తి చాలా బలంగా ఉంటుంది. అవి తమ పదునైన ముక్కుతో మరొక కుక్క వాసనను వెంటనే గుర్తిస్తాయి.