హిమాలయాలు(Himalayas) 23 వేల అడుగుల ఎత్తులో విస్తరించి ఉన్నాయి. వీటి సరాసరి ఎత్తు ఆరు వేల మీటర్లుగా ఉంది. వీటిలో ఎత్తయిన ఎవరెస్టు శిఖరం 8,848 మీటర్లు ఉంది. కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్‌లు ఇంత తక్కువ ఫ్లైట్ లెవెల్లో ఎగరవు. అందుకనే బోయింగ్777-300లాంటి పెద్ద పెద్ద విమానాలు హిమాలయాల పై నుంచి ఎగరవు.
* గాలి దొరకదు : హిమాలయాలు స్ట్రాటో ఆవరణం(Stratosphere) వరకు పైకి ఉంటాయి. ఈ ఆవరణంలో గాలి తక్కువగా ఉంటుంది. సాధారణ ప్రయాణికుల విమానం సముద్ర మట్టానికి 30 నుంచి 35వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుంది. అంతకంటే ఎత్తున ఎగరడం విమానాలకు ప్రమాదకరంగా మారుతుంది. ఇక్కడ ఎగరాలంటే ఇంకా ఎత్తుకు వెళ్లి ఎగరాల్సి ఉంటుంది. దీంతో అది జరగని పనిగా ఉంది.
దురదృష్టవశాత్తూ ఎప్పుడైనా అత్యవసర ల్యాండింగ్(Emergency Landing) చేయాల్సి వస్తే.. హిమాలయాలలో దిగడానికి చదునైన భూభాగం లేదు. దీనికి తోడు నావిగేషన్ డివైజ్‌లు కూడా వాతావరణ పరిస్థితుల వల్ల అక్కడ సరిగ్గా పని చేయవు. దీంతో ఏదైనా తప్పు జరిగితే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో కమ్యూనికేషన్ తెగిపోయే ప్రమాదం ఉంటుంది.