ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధనా గుప్తా కుమారుడు ప్రతీక్ ను 2011లో పెళ్లాడటం ద్వారా అపర్ణ యాదవ పరివారంలోకి ప్రవేశించారు. బిష్త్(రాజ్పుత్) కులానికి చెందినా పెళ్లి తర్వాత తన పేరును అపర్ణా యాదవ్ గా మార్చుకున్నారు. యూపీ సీఎం ఆదిత్యనాథ్ కూడా బిష్త్ కులస్తుడే. యోగి కాబట్టి వాటి పట్టింపుండదంతే.
మాజీ జర్నలిస్ట్ కూతురైన అపర్ణ లక్నోలో డిగ్రీ చేశారు. రాజకీయాలపై ఆసక్తితో యూకేలోని మాంచెస్టర్ యూనివర్సిటీలో చేరి పాలిటిక్స్ లో మాస్టర్స్ చేశారు. అపర్ణ క్లాసికల్ సింగర్. జంతు ప్రేమికురాలు కూడా. 'బి అవేర్' అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. జంతు సంరక్షణతో పాటు మహిళల భద్రతపైనా పనిచేస్తున్నారు.
ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో అప్ణనను పోటీకి దించాలని బీజేపీ భావిస్తోంది. అటు అఖిలేశ్ యాదవ్ సైతం తొలిసారి అసెంబ్లీ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. మరి కమలదళం అపర్ణను నేరుగా అఖిలేశ్ పైనే పోటీకి దింపుతుందా? చోటీ బహు వల్ల యూపీ రాజకీయాల్లో పెద్ద మార్పులేవైనా వస్తాయా? అనే ప్రశ్నలకు రాబోయే రోజుల్లో సమాధాలొస్తాయి.