ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా... రాజదండం (సెంగోల్ - sengol) తెరపైకి వచ్చింది. బ్రిటిషర్ల నుంచి భారతీయులకు అధికారం మార్పిడి జిరిగింది అనేందుకు గుర్తుగా... లార్డ్ మౌంట్ బాటన్ నుంచి అప్పటి మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అందుకున్న రాజదండం (sengol)ను కొత్త పార్లమెంట్ భవనంలోని... లోక్ సభలో ప్రతిష్టించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
గత సంవత్సరం వరకూ ఇది ... ప్రయాగ్రాజ్లోని అలహాబాద్ మ్యూజియంలో ఉండేది. 2022 నవంబర్ 4న దాన్ని ఢిల్లీలోని జాతీయ మ్యూజియానికి తరలించారు. ఈ నెల 28న కొత్త పార్లమెంట్ భవనం సెంట్రల్ విస్టాను ప్రారంభించనున్న మోదీ.. తమిళనాడులోని తురువడుత్తురై అధీనం నుంచి వచ్చే వేద పండితుల అధ్వర్యంలో రాజదండాన్ని లోక్సభలో ప్రతిష్టిస్తారు.