Meaning Of OK : ఓకే అనేది రెండక్షరాల పదమే కావచ్చు. కానీ ఈ రోజుల్లో చాటింగ్‌లో ఎక్కువగా వాడుతున్నది ఇదే. మనకు తెలియకుండానే దీన్ని మనం రోజూ చాలాసార్లు వాడుతున్నాం. రోజూ ఎవరితోనైనా ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఓకే ఓకే అని ఎన్నిసార్లు అంటామో. ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు కూడా "అది ఓకే గానీ" అంటూ.. ఈ పదాన్ని వాడేస్తాం.
ఓకే అంటే : కచ్చితమైన సమాచారం ప్రకారం.. OK అంటే.. ఆల్ కరెక్ట్ (All Correct) అని అర్థం. అలాగైతే మనం ఓకేకి బదులు AC వాడాలి.. మరి OK ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎలా జరిగిందంటే.. All Correct అనేది కాలక్రమంలో Oll Korrect అయ్యింది. దాంతో OK అనేది వాడుకలోకి వచ్చింది. ఐతే.. ఓకేకి అసలు అర్థం Okay అని చెబుతారు కొంతమంది. OK అనేది తప్పుడు పదం అనేది వారి వాదన.
1839లో బోస్టన్ మార్నింగ్ పోస్ట్‌లో పబ్లిష్ అయిన ఆర్టికల్‌లో Oll Korrect అనే పదం పుట్టినట్లు డాక్టర్ ఎల్లెన్ వాకర్ తెలిపారు. ఐతే.. ఉత్తర అమెరికాలో ఉండే నేటివ్ అమెరికన్ ఇండియన్ చోక్టా గిరిజనులు.. okeh అనే పదం వాడేవారు. దాని నుంచి OK వచ్చిందని కొందరు చెబుతారు. మరికొంతమంది ఈ పదం ఆఫ్రికాలోని వొలోఫ్ భాష నుంచి వచ్చిందని చెబుతారు. (ప్రతీకాత్మక చిత్రం)