WHAT IS KGF ASTONISHING HISTORY LIES BEHIND KOLAR GOLD MINES
Photos: కేజీఎఫ్ వెనక ఇంత చరిత్ర ఉందా? తెలుసుకోవాల్సిందే
కేజీఎఫ్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అని అర్థం. కర్ణాటకలోని కోలార్ బంగారు గనులకు వేల ఏళ్ళ చరిత్ర ఉంది. హరప్పా మొహెంజోదారో నాగరికత నాటికే ఆ గనుల నుంచీ బంగారాన్ని వెలికితీసేవారు. వేల ఏళ్లుగా లక్షల టన్నుల కొద్దీ బంగారాన్ని ఇచ్చాయి ఆ అద్భుతమైన గనులు. రాన్రానూ బంగారం తరిగిపోయింది. చివరకు దొరికే ఖనిజం కంటే తవ్వకానికి అవుతున్న ఖర్చు ఎక్కువవ్వడంతో కేంద్ర ప్రభుత్వం 2001 మార్చి 21న గనులను మూసివేసింది. మరి శతాబ్దాలుగా ఆ గనుల కోసం ఏయే రాజవంశాలు ఏం చేశాయో ఓసారి తెలుసుకుందాం.
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ప్రదేశాన్ని లిటిల్ ఇంగ్లండ్ అని పిలిచేవాళ్లు. కర్ణాటకలోని ఓ జిల్లాయే కోలార్. అక్కడి రాబెర్ట్సోన్ పేట గనుల తవ్వకాలకు కేంద్రంగా ఉండేది.
2/ 11
క్రీస్తు శకం 2వ శతాబ్దం వరకూ కోలార్ ప్రాంతంలో గనుల తవ్వకాలు రహస్యంగా సాగేవి. ఆ జిల్లాను గంగాలు ఆక్రమించాక అసలు విషయం ప్రపంచానికి తెలిసింది. (ఫొటో - వికీమీడియా)
3/ 11
రెండో శతాబ్దంలో గంగాల పాలనలో కోలార్ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. గంగాలు వెయ్యేళ్లకు పైగా కోలార్‌ను పాలించారు. (ఫొటో - వికీమీడియా)
4/ 11
క్రీస్తుశకం 1004లో చోళులు కోలార్‌ను స్వాధీనం చేసుకున్నారు. దానికి నికారిలిచోళ మండలం అని పేరు పెట్టారు.
5/ 11
క్రీస్తు శకం 1117లో బంగారు గనులను ఆన్వేషించడానికి వచ్చిన హొయసాళులు... చోళులను ఓడించి, కోలార్‌ను ఆక్రమించారు. (ఫొటో - వికీపీడియా)
6/ 11
హొయసాళులను ఓడించిన శ్రీకృష్ణదేవరాయలు కోలార్‌ను పాలించారు. 300 ఏళ్లకు పైగా ఈ పాలనసాగింది.
7/ 11
బానాలు, కదంబాలు, చాళుక్యులు, పల్లవులు, వైదంబాలు, రాష్ట్రకూటలు, చోళులు, హొయసాళులు ఎన్నో రాజవంశాలు రహస్యంగా చిన్న మొత్తాల్లో బంగారం తవ్వకాలు సాగించాయి. (ఫొటో - వికీపీడియా)
8/ 11
1850లో బ్రిటిషర్ల పాలనలో భారీ ఎత్తున బంగారు గనుల తవ్వకాలు సాగాయి. భారతీయులను బానిసలుగా చేసి, వారితో తవ్వకాలు జరిపించారు.
9/ 11
ప్రపంచ బ్యాంక్ రుణం ఇవ్వలేమని చెప్పినప్పుడు, మాజీ ప్రధాని నెహ్రూ కేజీఎఫ్‌ను ఆశ్రయంచారు. ఇండియాలో విలువైన ఆస్తి ఉందన్న ఆయన, గనులను చూపించి రుణం పొందారు. అలా కోలార్ గనుల గొప్పదనం ప్రపంచానికి తెలిసింది.
10/ 11
1902లో దేశంలోని మొదటి పవర్ జెనరేషన్ ప్లాంట్ నుంచీ ముందుగా కోలార్ గనులకే విద్యుత్ సరఫరా జరిగింది. గనుల తవ్వకాలకు డిమాండ్ పెరిగినప్పుడు తమిళనాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కార్మికుల్ని తీసుకొచ్చారు.
11/ 11
ఇలా వేల ఏళ్లుగా లక్షల టన్నుల బంగారాన్ని ఇచ్చిన అద్భుత గనులు కాలగర్భంలో కలిసిపోయాయి. ఇంత చరిత్ర ఉంది కాబట్టే ఈ గనుల పేరుతో భారీ బడ్జెట్ సినిమా కేజీఎఫ్ రెండు పార్టులుగా రిలీజవుతోంది.