ఎలాంటి క్యాన్సర్ నైనా తరిమికొట్టే అరుదైన నల్ల పుట్టగొడుగులు
Truffle Mushrooms : ట్రఫిల్ మష్రూమ్స్ అనేవి... మెత్తగా, గుండ్రంగా ఉంటాయి. ఇవి ఫంగస్ జాతికి చెందినవి. పూర్వం వీటిని మందుల తయారీలో ఎక్కువగా వాడేవారు. ఇప్పుడు వంటల్లో కూడా భాగమైపోయింది. సువాసనకు తోడు... చక్కటి రంగుతో ఆకట్టుకుంటాయి. పైగా వీటిలో బోలెడన్ని పోషకాలుంటాయి. అందువల్ల రకరకాల అనారోగ్య సమస్యలకు ఇవి చెక్ పెడతాయి. పైకి కందగడ్డల్లా కనిపించే ఈ పుట్టగొడుగులు... అత్యంత తేలికగా ఉంటాయి. కట్ చేస్తే... లోపల చిన్నచిన్న గదులతో, పసుపు రంగులో కనిపిస్తాయి. వీటిలో జన్యుపరమైన మార్పులు చేసి... తెలుపు రంగులో కూడా వీటిని పుట్టించారు. ఇవి ఎక్కువగా ఫ్రాన్స్‌లోని దట్టమైన అడవుల్లో పెరుగుతాయి.


అడవుల్లో మాత్రమే పెరిగే ఈ ట్రఫిల్ మష్రూమ్స్ అరుదైనవి. ఖరీదైనవి కూడా. ఒక్కోటీ 30 నుంచీ 60 గ్రాముల బరువు పెరుగుతుంది. దాని ధర ప్రపంచ మార్కెట్లో $30 నుంచీ $100 ఉంటుంది. మన రూపాయల్లో చెప్పాలంటే రూ.2,000 నుంచీ రూ.7000 దాకా ఉంటుంది. అంత రేటెక్కువ ఉన్నా... వాటితో ఉండే ఆరోగ్య ప్రయోజనాలతో పోల్చితే... ఆ మాత్రం ధర తప్పదంటున్నారు పరిశోధకులు.


ఈ పుట్టగొడుగల నుంచీ నూనెను తీస్తారు. అది ఆలివ్ ఆయిల్ కంటే ఎక్కువ మేలు చేస్తుంది. దాన్ని ట్రఫిల్ ఆయిల్ అని పిలుస్తున్నారు. దాన్ని పాస్తా, పిజ్జాలలో టేస్ట్ కోసం వాడుతున్నారు. అందులోని పాలీఫెనాల్స్‌లో మన శరీరంలోని విష వ్యర్థాలను, చెడు బ్యాక్టీరియాను తొలగించే లక్షణాలున్నాయి. అవి కణాలను కాపాడి ముసలితనం రాకుండా చేస్తాయట.


ట్రఫిల్ పుట్టగొడుగుల్లో పిండిపదార్థాలు, మాంసకృత్తులు, ఫైబర్ (పీచు), ఫాట్టీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. మన శరీరానికి అవసరమైన 9 అమైనో యాసిడ్లను ఈ పుట్టగొడుగులు ఇవ్వగలవని తేలింది.


ఈ రోజుల్లో క్యాన్సర్ వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరుగుతోంది. అసలు కేన్సరే రాకుండా చేసుకోవాలంటే ఈ పుట్టగొడుగులు (నలుపు లేదా తెలుపు) తింటే అద్భుత ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు నిపుణులు. సెర్వికల్, బ్రెస్ట్, కొలొన్ కేన్సర్ కణాల్ని ఎదుర్కోవడంలో ఈ పుట్టగొడుగులు బాగా పనిచేస్తున్నాయని పరిశోధనల్లో తేలింది.