Kohli: చిట్టి క్యూటీతో హ్యాపీగా..! కోహ్లి కూతురు వామిక పిక్ వైరల్
Kohli: చిట్టి క్యూటీతో హ్యాపీగా..! కోహ్లి కూతురు వామిక పిక్ వైరల్
Kohli: ఆధ్యాత్మిక యాత్రల్లో ఉన్న విరుష్క జోడి రిషికేశ్ బాటపట్టింది. రిషికేశ్ కొండల్లో కూతురు వామికతో కలిసి ట్రెక్కింగ్ చేస్తున్న విరాట్-అనుష్క ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ముందు లభించిన విశ్రాంతిని కోహ్లి కుటుంబానికి కేటాయించాడు. ఈ నెల 9నుంచి ఆస్ట్రేలియాతో స్వదేశంతో బార్డర్-గవాస్కర్ ట్రోఫి ప్రారంభంకానుంది.
2/ 7
ప్రస్తుతం భారత్ జట్టు న్యూజలాండ్తో టీ20 సరీస్ ఆడుతుండగా.. ఈ పొట్టి సిరీస్‌కు సీనియర్లకు రెస్ట్ ఇచ్చింది బీసీసీఐ. దీంతో ఆధ్యాత్మిక యాత్రల్లో బిజీ అయ్యాడు కింగ్ కోహ్లి.
3/ 7
తన చిట్టి క్యూటీ వామిక కూడా తల్లిదండ్రుల వెంట యాత్రలు చుట్టేస్తోంది. రిషికేశ్ యాత్రలో ట్రెక్కింగ్ చేస్తున్న విరాట్.. చిన్నారి వామికను భుజానకెత్తుకుని తీసుకెళుతున్న ఫోటోలు బయటకు రావడంతో ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి.
4/ 7
బంగ్లా టూర్‌కి ముందు నీమ్ కరోలీ బాబా ఆశ్రమాన్ని దర్శించుకున్న విరాట్.. ఇప్పుడు రిషికేశ్‌లో యాత్రలో ఉన్నాడు. భార్య, కూతురితో కలిసి ట్రెక్కింగ్‌కి వెళ్లిన విరాట్, వామిక ఫేస్‌ని కనిపించనివ్వకుండా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
5/ 7
ట్రెక్కింగ్ దారిలో సెలయేళ్లు, చెట్లు ఉండగా.. వామిక వాటిని చూసి మురిసిపోతుండగా.. విరాట్ ఫ్యాన్స్ ఆనందానికి అంతే లేకుండా పోయింది.
6/ 7
వామికను భుజాన వేసుకుని కోహ్లి నడుస్తున్న ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న ఈ జోడి తమ బిజీ లైఫ్‌ను పక్కన పెట్టి ఎంజాయ్ చేస్తున్నారు.
7/ 7
మూడున్నరేళ్ల పాటు సెంచరీ లేకపోవడం, కెప్టెన్సీ కోల్పోవడంతో కెరీర్ కష్ట కాలాన్ని ఎదుర్కొన్న కోహ్లి.. ఆసియా కప్ తర్వాత మునపటి ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆసీస్‌పై సిరీస్‌కు సిద్ధమయ్యాడు.