అయితే, ఈ బ్యాక్టీరియాను చూసి సైంటిస్టులు ఉలిక్కిపడ్డారు. సాధారణంగా బ్యాక్టీరియాను మనం కళ్లతో చూడలేం. కానీ, ఈ బ్యాక్టీరియా మన కళ్లకు కూడా కన్పిస్తోంది. బ్యాక్టీరియా తెలుపు రంగులో వెర్మిసెల్లీ ఆకారంలో ఉంటుంది. ఇది మైక్రోస్కోపిక్ సల్ఫర్ రేణువులను కలిగి ఉంది. దీని కారణంగా ఇది ముత్యాల మెరుపును ఇస్తుంది.
కరేబియన్ సముద్రంలోని గ్వాడెలొపె అనే ద్వీపంలో శాస్త్రవేత్తలు ఈ బాక్టీరియాను గుర్తించారు. ఫ్రంచ్ ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందీ ద్వీపం. ఇక్కడి సముద్ర తీర ప్రాంతాల్లో శాస్త్రవేత్తలు ఈ పొడవాటి బాక్టీరియాను కనుగొన్నారు. దీనికి థియోమార్గరిట మాగ్నిఫికా (Thiomargarita magnifica) అనే పేరు పెట్టారు. ఇప్పటివరకు అతిపెద్ద బాక్టీరియాలుగా చెప్పుకొన్న వాటికి 50 రెట్లు పెద్దగా ఉంటుంది దీని పొడవు. ఎలాంటి పరికరాలు, మైక్రోస్కోప్‌లు లేకుండా నేరుగా దీన్ని చూడవచ్చు.