దాదాపు రెండేళ్ల కిందట చుట్టుపక్కల అరబ్ దేశాలు... ఖతార్‌ను బాయ్‌కాట్ చేశాయి. అయినప్పటికీ ఖతార్ అభివృద్ధి సాధిస్తూ పోతోంది. (Image: AP)
ప్రపంచంలో ఫేమస్ ఆర్కిటెక్ట్లంతా దోహాలో ఉన్నారిప్పుడు. వాళ్లు నిర్మిస్తున్న నిర్మాణాలను చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. (Image: AP)
దోహాలో మోడ్రన్ షాపింగ్ మాల్స్ సందడిగా ఉన్నాయి. అక్కడ ఎంత ఎండలు ఉన్నా... ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు టూరిస్టులు. (Image: AP)
ఈ స్టేడియంలో 40వేల మంది కూర్చునే వీలుంది. సంప్రదాయ ధౌ ఫిషింగ్ బోట్ ఆకారంలో దీన్ని నిర్మించారు. (Image: AP)
ఈ స్డేడియం పైభాగం క్లోజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. కూలింగ్ సిస్టం కూడా ఉంది. అందువల్ల ఇందులో ఏడాది మొత్తం మ్యాచ్‌లు నిర్వహించుకునే వీలుంటుంది. (Image: AP)
వేడి కారణంగా... జూన్/జులైలో జరగాల్సిన వరల్డ్ కప్‌ను నవంబర్ 21 నుంచి డిసెంబర్ 18 మధ్య నిర్వహించబోతున్నారు. జస్ట్ 28 రోజుల్లో టోర్నమెంట్ ముగియనుంది. (Image: AP)
గ్యాస్ వనరులు ఉండే ఖతార్... అంతా కలిపి 50 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. మొత్తం జనాభా 27 లక్షల మందే. ఫుట్‌బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న తొలి అరబ్ దేశం ఇదే. ఖతార్‌ను ఎంపిక చెయ్యడం వివాదాస్పదమైంది కూడా. (Image: AP)
ఖతార్, గల్ఫ్ దేశాల్లో కార్మికుల్ని హింసిస్తున్నారని మానవ హక్కుల సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. ఈ కార్మికుల్లోనూ ఎక్కువ మంది ఇండియా ఇతర దక్షిణాసియా దేశాల నుంచీ వస్తున్నవారే. (Image: AP)
ఖతార్ ఈమధ్య కొన్ని సంస్కరణలు తెచ్చింది. అయినప్పటికీ కఫాలా విధానం ఎత్తివేయాలని హక్కుల సంఘాలు కోరుతున్నాయి. కార్మికులందరికీ వెంటనే ఎగ్జిట్ వీసాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. (Image: AP)
ఇది దోహాకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న... ఖతార్‌లోనే అతి పెద్ద డైరీ, మాంస ఉత్పత్తి కేంద్రం. ఈ బలాద్నా ఫారంలో ఒక రౌండ్‌కి 100 గేదెలు పాలు ఇచ్చే ఏర్పాటుంది.(Image: AP)
దోహాకి 40 కిలోమీటర్ల దూరంలో సీలైన్ బీచ్ రోడ్డులో అద్దెకు తీసుకున్న ఇసుక బగ్గీలపై రైడింగ్‌కి వెళ్తున్న సోదరులు. (Image: AP)
దోహాలోని కార్నిష్ వాటర్ ఫ్రంట్ ప్రొమెనేడ్ దగ్గర కూర్చున్న పర్యాటకులు. ఇక్కడ నైట్ వ్యూలో స్కైలైన్ చూడటం ఓ మర్చిపోలేని అనుభూతి. (Image: AP)
దోహాలోని షెయిరెబ్ డౌన్టౌన్లో ట్రయల్ సెషన్లో టీమ్ ఆపరేటర్‌గా డ్రైవింగ్ చేస్తున్న మహమద్. (Image: AP)
ఇది అల్ జనోబ్ స్టేడియం. ఇదివరకు దీన్ని అల్ వక్రా స్టేడియం అనేవాళ్లు. దోహాకి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. (Image: AP)