Vanita Kharat: బాలీవుడ్ నటి వనితా ఖారత్ బోల్డ్ ఫొటో షూట్ చేసింది. చాలా బొద్దుగా కనిపించే ఆమె.. నవ్వూతూ నగ్నంగా కెమెరాకు పోజులిచ్చింది. నా శరీరాకృతిని చూసి గర్వపడుతున్నా.. బాడీ పాజిటివిటీ మూవ్మెంట్లో పాల్గొందామని పిలుపునిచ్చింది. వనితా ఖారత్.. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ ఖాన్‌లో నటించింది.
Anushka Sharma: అనుష్క శర్మ, తన భర్త విరాట్ కొహ్లీతో బాల్కనీలో కూర్చున్న సమయంలో ఓ ఫొటో గ్రాఫర్ ఫొటో తీశాడు. దాని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అనుష్క శర్మ ఆగ్రహం వ్యక్తం చేసింది. తామూ మనుషులమేనని..తమకూ ప్రైవసీ ఉంటుందని మండిపడింది. ఎటువంటి అనుమతులు లేకుండా ఫోటోలు తీయడం సమంజసం కాదని ఆమె ఫైర్ అయింది.
Swapnil Shinde: బాలీవుడ్ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ స్వప్నిల్ షిండే అమ్మాయిలా మారారు. తన పేరును సైషాగా మార్చుకున్నారు. హార్మోన్ల లోపం వల్ల చిన్నప్పటి నుంచి ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నానని..తాను ఇప్పుడు గేను కాదని.. ట్రాన్స్ ఉమెన్ అని పేర్కొన్నారు. దీపికా పదుకొనే, కరీనా కపూర్, శ్రద్ధా కపూర్, సన్నీ లియోన్, తాప్సీ సహా పలువురు సెలబ్రిటీలకు ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేశారు స్వప్నిల్.
Bhuma Akhila Priya: హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన కేసీఆర్ సమీప బంధువుల కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అరెస్ట్ అయ్యారు. ప్రవీణ్ రావు, ఆయన ఇద్దరు సోదరులను కిడ్నాప్ చేసిన కేసులో భూమా అఖిల ప్రియ హస్తముందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఏవీ సుబ్బారెడ్డి ఏ-1, అఖిల ప్రియ ఏ-2 , భార్గవ్ రామ్ ఏ3-గా ఉన్నారు.