Happy Rose Day 2023 : మీరు ప్రేమికుల వారంలో భాగంగా ఇవాళ.. హ్యాపీ రోడ్ డే సందర్భంగా.. మీ ప్రేయసికి రోజూ పూల బొకే ఇవ్వాలి అనుకుంటున్నారా.. అయితే.. ఓసారి ఆలోచించుకోండి. ఎందుకంటే.. ఇప్పుడు రోజా పూల ధర బాగా పెరిగిపోయింది. ఒకట్రెండు పువ్వులైతే పర్వాలేదు గానీ... బొకే ఇవ్వాలి అనుకుంటే.. భారీగా మనీ ఖర్చవుతుంది. వేల రూపాయలు వదిలిపోతాయి.
ఇవాళ్టి నుంచి వారం పాటూ... రోజా పూలు, చాక్లెట్లు, టెడ్డీ బేర్లూ, గిఫ్ట్ ఉత్పత్తులకు సేల్స్ బాగా పెరుగుతుంది. దేశవ్యాప్తంగా గులాబీ పూల రైతులకు భారీగా ఆర్డర్లు వచ్చాయి. సాధారణ రోజుల్లో ఎరుపు రంగు రోజా పువ్వు ఒక్కొక్కటీ రూ.20 ఉండేది. అది ఇప్పుడు రూ.70 నుంచి రూ.80 పలుకుతోంది. అంతలా ధర ఎందుకు పెంచారంటే.. రైతులే పెంచారని వ్యాపారులు చెబుతున్నారు.
రోజ్ డేకి ఇచ్చే పూలకు భారీ కాడ ఉంటుంది. అన్ని పూలకూ అంత పెద్ద కాడ ఉండదు. అలాంటి పొడవాటి కాడ ఉన్న పూలను ప్రత్యేకించి సెలెక్ట్ చేస్తారు. అందువల్ల వాటికి ధర ఎక్కువగా ఉంటుంది. రెండు మూడు పూలను కలిపి.. బొకేలా చేస్తే.. దాని ధర రూ.120 నుంచి రూ.300 దాకా ఉంటోంది. ఇక పెద్ద గుత్తులా పూల బొకే ఉండాలంటే దాని ధర రూ.2000 నుంచి రూ.3000 దాకా ఉంటోంది.
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి రాగానే గులాబీ పూలకు డిమాండ్ పెరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రోజా సాగు చేపట్టే రైతులు.. సరైన టైంలో పంట వేస్తారు. ఈ నెలంతా పూలకు డిమాండ్ ఉంటుంది. ప్రేమికుల రోజు (Valentine's Day)నాడు ప్రపోజ్ చేసిన జంటలు.. ఆ తర్వాత పెళ్లికి ప్రిపేర్ అవుతారు. ఆ కారణంగా ఫిబ్రవరి 14 తర్వాత కూడా రోజా పూలకు డిమాండ్ కొనసాగుతుంది.
రోజాలు రొటీన్ అనుకునేవారు.. వాటి బదులు లిల్లీ పూలను కూడా ఇవ్వొచ్చు. అవి కూడా ఎంతో అందంగా, క్లాసిక్గా ఉంటాయి. ఐతే.. రోజాల కంటే లిల్లీ పూల ధర మరింత ఎక్కువగా ఉంది. ఒక్క లిల్లీ పువ్వు రేటు రూ.200 ఉండగా.. బొకే రూ.2500 నుంచి రూ.4000 దాకా ఉంది. కొంతమంది 6 లిల్లీ పూలు మధ్యలో 1 రోజా ఉండేలా బొకే కావాలని కోరుతున్నట్లు ఓ వ్యాపారి తెలిపారు. ఇలా.. వాలెంటైన్స్ వీక్.. అటు రోజా రైతులు, ఇటు వ్యాపారులకు లాభాలు తెస్తున్నాయి.