Valentine's Week : ఈ సంవత్సరం ఫిబ్రవరి 7 నుంచి 13 వరకూ ప్రేమికుల వారం ఉండబోతోంది. 14న ప్రేమికుల రోజు ఉంటుంది. దీన్ని బాగా జరుపుకునేందుకు ప్రేమికులు తమ ఏర్పాట్లలో ఉన్నారు. 7న రోజ్ డే, 8న ప్రపోజ్ డే, 9న చాక్లె్ట్ డే, 10న టెడ్డీ డే, 11న ప్రామిస్ డే, 12న హగ్ డే, 13న కిస్ డే ఈ అన్ని రోజులూ చక్కగా జరుపుకునేందుకు ప్లాన్స్ వేసుకున్నారు. మరి ప్రేమికుల రోజుకు సంబంధించి 30 ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
Pagan festival : కొందరు చరిత్రకారులు.. ప్రేమికుల రోజు అనేది వాలెంటైన్ వల్ల రాలేదనీ.. ప్రాచీన పగాన్ (లూపర్‌కాలియా) పండుగ వల్ల వచ్చిందని అంటున్నారు. రోమ్‌లో ఫిబ్రవరి 15న లూపర్‌కాలియా అనే పండుగ జరుపుతారు. ఈ సందర్భంగా జంతువుల్ని బలి ఇచ్చి.. వాటి చర్మాలతో మహిళల్ని కొట్టేవారు. అలా చేస్తే వారికి పిల్లలు పుడతారని నమ్మేవారు.
Cupid : వాలెంటైన్ కార్డులపై ధనస్సుతో ప్రేమ బాణం గురిపెడుతూ.. రెక్కలతో ఉన్న ఓ వ్యక్తి బొమ్మ ఉండేది. అతను గ్రీకుల దేవుడు ఎరోస్. అందమైన, మరణం లేని వాడు. తన మోహంతో ఎవరినైనా ప్రేమలో పడేయగలిగేవాడు. నాలుగో శతాబ్దంలో రోమన్లు.. ఎరోస్ని చంటి పిల్లాడిలా చూపించారు. అలా ఆ పిల్లాడే ఇప్పటికీ కార్డులపై ఉంటున్నాడు. ఆ పిల్లాడికి క్యుపిడ్ అనే పేరు పెట్టారు.
Expense and Love : నేషనల్ రిటైల్ ఫౌండేషన్ ప్రకారం.. 2019లో అమెరికన్లు వాలెంటైన్స్ డే గిఫ్ట్స్ కోసం 20 బిలియన్ డాలర్లు (రూ.1,65,172 కోట్లు) ఖర్చుపెట్టారు. 2020లో ఈ ఖర్చు 27.4 బిలియన్ డాలర్ల (రూ.2,26,285 కోట్లు)కి పెరిగింది. అంటే సగటున ఒక్కో అమెరికన్ ప్రేమికుల రోజు కోసం రూ.16,186 ఖర్చుపెడుతున్నారు. అబ్బాయిలైతే ఒక్కొక్కరూ రూ.24వేలకు పైగా ఖర్చు చేస్తుంటే.. అమ్మాయిలు ఒక్కొక్కరూ రూ.8,750 ఖర్చు పెడుతున్నారు.