వాలెంటైన్స్ డే దగ్గరపడుతుంది. ఏటా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే జరుపుకుంటారు. ప్రజలు తమ ప్రేమను వ్యక్తపరచడానికి ఏడాది పొడవునా ఈ రోజు కోసం వేచి ఉంటారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ప్రేమ దినోత్సవాన్ని జరుపుకోవడానికి, మార్కెట్లన్నీ అలంకరించబడి, ప్రేమికులు నెలల తరబడి సిద్ధమవుతారు. అయితే కొన్ని దేశాలలో వాలెంటైన్స్ డేని అస్సలు జరుపుకోరు. ఇక్కడ ప్రజలు ప్రేమించరని కాదు, బహిరంగంగా ప్రేమను వ్యక్తీకరించడం ఆ దేశాల్లో నిషేధించబడింది.
ఇండోనేషియా : ఇండోనేషియాలో ఏ చట్టమూ దీన్ని నిషేధించనప్పటికీ, ఇక్కడ వాలెంటైన్స్ డేని ఎవరూ జరుపుకోరు. రాడికల్ ముస్లింలు ఈ దేశంలోని సురబయ, మకస్సర్ వంటి ప్రాంతాల్లో ఉంటారు. ఇది కాకుండా, కొన్ని ప్రాంతాల్లో వాలెంటైన్స్ డే వ్యతిరేక ఊరేగింపులు జరుగుతాయి, దీని కారణంగా ఇక్కడ ఈ రోజు జరుపుకోవడం నిషేధించబడింది. ముస్లిం చట్టం దీనిని అనుమతించదు, అందుకే ఇక్కడ వ్యతిరేకించబడింది.(ప్రతీకాత్మక చిత్రం)
ఇరాన్ : ఇరాన్ కూడా ఒక ముస్లిం దేశం. ఇక్కడ మత పెద్దల అధికారం నడుస్తుంది. ప్రేమికుల రోజు బహుమతులు, దానికి సంబంధించిన వస్తువులను ప్రభుత్వం ఇక్కడ నిషేధించింది. దీనిని పాశ్చాత్య సంస్కృతిగా పరిగణించి నిషేధించబడింది. వాలంటైన్స్ డేకి బదులుగా మెహ్రీగాన్ అనే పాత పండుగను జరుపుకోవాలని చెప్పబడింది. ఈ పండుగ స్నేహం, ప్రేమ మరియు ఆప్యాయతలకు కూడా సంబంధించినది. (ప్రతీకాత్మక చిత్రం)
పాకిస్తాన్ : మన దేశంలో వాలెంటైన్స్ డే రోజున మార్కెట్లను అలంకరించినప్పటికీ, పాకిస్థాన్లో మాత్రం ఈ రోజుపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంటుంది. ఈ రోజు చాలా నిరసనలు ఉంటాయి.. ఫిబ్రవరి 7, 2018 న, ఇస్లామాబాద్ హైకోర్టు ద్వారా వాలంటైన్స్ డే వేడుక మరియు మీడియా కవరేజీపై నిషేధం విధించబడింది. ఇది పాశ్చాత్య ప్రభావానికి, ఇస్లాంకు వ్యతిరేకంగా పరిగణించబడుతుందని పాక్ చెబుతోంది.(ప్రతీకాత్మక చిత్రం)
మలేషియా : మలేషియాలో కూడా గణనీయమైన ముస్లిం జనాభా ఉంది. ఇక్కడ ప్రేమికుల దినోత్సవానికి సంబంధించి 2005లో ఫత్వా జారీ అయింది. ఇక్కడ కూడా కారణం ఏమిటంటే, ఈ రోజు ఇస్లాంకు వ్యతిరేకంగా పరిగణించబడుతుంది, పాశ్చాత్య నాగరికతతో ముడిపడి ఉందని భావిస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ వాలెంటైన్స్ డే వ్యతిరేక ప్రచారం కూడా జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
ఈ దేశాలే కాకుండా సౌదీ అరేబియాలో వాలెంటైన్స్ డే విషయంలో చాలా కాలంగా ఇదే వాతావరణం నెలకొంది. దీంతో 2014లో 39 మంది జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అయితే, ఈ నిషేధాన్ని 2018 సంవత్సరంలో ఎత్తివేశారు. ఉజ్బెకిస్తాన్లో కూడా, 2012 సంవత్సరం వరకు ఈ రోజుకి సంబంధించి ఇదే వాతావరణం ఉంది, కానీ ఆ తర్వాత ఇక్కడ వాలెంటైన్స్ డే జరుపుకోవడానికి ఎటువంటి ఆంక్షలు లేవు.(ప్రతీకాత్మక చిత్రం)