ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీకి చెందిన ఆర్టీఓ కార్యాలయంలో ప్రతి రోజూ కుప్పలు తెప్పలుగా ఫైళ్లు వస్తుంటాయి ఈ క్రమంలో అక్కడ ఎలుకలు కూడా ఎక్కువయ్యాయి. అయితే.. ఒకరోజు అక్కడికి పిల్లి వచ్చింది. అధికారులు కూడా దాన్ని వెళ్లగొట్టలేదు. దాన్ని ప్రేమతో ఎదో ఒకటి వేశారు. దీంతో అది అక్కడే ఉండిపోయింది. పైళ్లను ఎలుకలు కొరికేయకుండా చూసింది. దీంతో అక్కడి వారు.. దాన్ని మరింత ప్రేమగా చూసుకున్నారు.