ఈ ప్రపంచంలో లక్షల కొద్దీ వృక్ష జాతులు ఉన్నాయి. ఒక్కో చెట్టుకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మనకు తెలుసు... చెట్లకు కూడా ప్రాణం ఉంటుందని. కానీ అవి మనలా నడవలేవు, మనలా తమ భావాల్ని వ్యక్తం చేయలేవు. కానీ ఆ చెట్టు అలాకాదు. దానికి మనుషుల లాగే చక్కిలిగింతలు ఉన్నాయి. ఈ చెట్టును స్థానికంగా గుద్గుదలీవాలా (కితకితల) చెట్టు అని పిలుస్తున్నారు.
ఈ చెట్లకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే... వీటి కాండాన్ని మీరు ముట్టుకుంటే... వెంటనే ఈ చెట్ల కొమ్మలు, ఆకులూ అటూ ఇటూ ఊగుతాయి. మీరు కాండాన్ని ఊపకపోయినా... జస్ట్ టచ్ చేస్తే చాలు... ఇలా అవుతుంది. అందువల్లే దీన్ని చక్కిలిగింతల చెట్టు అని పిలుస్తున్నారు. ఈ చెట్టు సైంటిఫిక్ నేమ్ రండియా డ్యుమెటోరమ్ (RANDIA DUMETORUM). ఇది చాలా సున్నితమైన చెట్టు. దీని కాండం నుంచి సెన్సిటివ్ సెన్సార్లు చెట్టు అంతటా ప్రవహిస్తాయి. అందువల్లే ముట్టకోగానే కొమ్మలు, ఆకులూ ఊగుతాయి.