రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆఫీసును ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న సమస్యలు పరిష్కారం కాకపోతే, ప్రజలు జిల్లా కలెక్టర్ అధికారిని కలిసి తమ వినతులు ఇస్తుంటారు. అంతే కాకుండా.. అక్కడ దాదాపు పెద్ద హోదా ఉన్న అధికారులు ఉంటారు. అంతే కాకుండా ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించి ముఖ్యమైన శాఖలు అక్కడే పనిచేస్తుంటాయి.
ఈ క్రమంలో ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లోని ఘజియా బాద్ లో ఉన్న జిల్లా కలెక్టర్ కార్యలయం ప్రస్తుతం వార్తలలో నిలిచింది. ఘజియాబాద్ జిల్లా వాసులు కూడా న్యాయం చేస్తారనే ఆశతో పెద్ద సంఖ్యలో కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకుంటుంటారు. ఈ క్రమంలో ప్రస్తుతం అక్కడ విచ్చల విడిగా వీధికుక్కలు కన్పిస్తున్నాయి. అవి పలుమార్లు అనేక మందిపైదాడికూడా చేశాయి. అయిన, వాటిని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు.
ఓ కుక్కను కూడా ఈ వీడియోలో చూడవచ్చు. జిల్లా అధికారి రాకేష్ కుమార్ సింగ్ గది దగ్గరకి వీధికుక్క వెళ్లింది. అంతే కాకుండా.. అది ఆఫీస్ అంతా సంచరిస్తు ఎక్కడ పడితే అక్కడకు వెళ్లింది. ఆ తర్వాత.. ADM అడ్మినిస్ట్రేషన్ రీతు సుహాస్ కార్యాలయం వైపుకు కూడా వెళ్లింది. కొన్నిసార్లు అవి అక్కడున్న వారిపై దాడులు కూడా చేశాయి.
అంతే కాకుండా.. కుక్కలు అక్కడ గోడలపై మూత్రవిసర్జన చేయవు. కేవలం అక్కడ ఉన్న మరుగు దొడ్డిలోనే వాటి పనికానించేస్తుంటాయి. కుక్కలు సాధారణంగా మూత్రవిసర్జన చేసినప్పుడు, అవి గోడపై లేదా ఏదైనా ఇతర వస్తువులపై మలవిసర్జన చేస్తాయని మనకు తెలుసు. కానీ కలెక్టరేట్లో నివసించే ఈ కుక్కలు మరుగుదొడ్డిని వినియోగిస్తున్నాయి.
బహుశా ఈ కుక్కలు కలెక్టరేట్ గోడలపై పోస్ట్ చేసిన పరిశుభ్రత సందేశానికి చాలా ప్రాముఖ్యతనిచ్చాయేమోనని కొందరు ఫన్నీగా కామెంట్లు చేస్తుంటారు. ఘజియాబాద్ కలెక్టరేట్ కార్యాలయానికి రోజూ చాలా మంది ఫిర్యాదుదారులు, ఫిర్యాదుదారులు చేరుకుంటున్నారు. వీరిలో మహిళలు, పిల్లలు, వృద్ధులు ఉన్నారు. ఇవి దాడులు చేస్తే ఎలాగంటూ అక్కడున్న వారు అధికారులను ప్రశ్నిస్తున్నారు. దీనికోసం అక్కడి కలెక్టర్ రాకేష్ కుమార్ సింగ్ ను కలవడానికి ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు.