Viral Photos:ఉర్ఫీజావెద్ను మించిన మరో కళాకారుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు. నేనావత్ తరుణ్ అనే డిజిటిల్ మీడియా క్రియేటర్ అచ్చం ఉర్ఫీజావెద్ వేసుకున్నట్లుగానే డిఫరెంట్ డిజైనర్ కాస్ట్యూమ్స్ వేసుకొని డ్యాన్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
1/ 9
సోషల్ మీడియాలో విచిత్రమైన వ్యక్తులు వాళ్లు చేసే వింతలు ఎక్కవ అయ్యాయి. ఎక్కడో ఉన్న వాళ్లు ఒక్క వీడియోతో లేదంటే ఒక్క పోస్ట్, ఫోటోలను షేర్ చేయడంతో అందరికి పరిచయం అవుతున్నారు. సోషల్ మీడియా పుణ్యమా అంటూ పాపులర్ అవుతున్నారు. (Photo:Instagram)
2/ 9
బాలీవుడ్‌కి చెందిన నటి, బిగ్‌బాస్ బ్యూటీ ఉర్ఫీజావెద్ వింత డ్రెస్‌లు,విచిత్రంగా డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్‌తో నిత్యం మీడియాలో, సోషల్ మీడయాలో వీడియోలు షేర్ చేస్తూ అందరికి బాగా పాపులర్ అయింది. (Photo:Instagram)
3/ 9
బోల్డ్ బ్యూటీ ఉర్ఫీజావెద్కి ఏ వస్తువైనా డ్రెస్‌లా మార్చుకోవడం .. శరీరం అంతా కనిపించేలా అలాంటి డ్రెస్‌లు వేసుకొని పబ్లిక్ ప్లేసుల్లోకి రావడమే కాదు ఫోటోలకు ఫోజులివ్వడం హాబీగా మార్చుకుంది. ఈవీడియోలు, ఫోటోలతోనే అందరితో విమర్శలపాలవుతోంది. (Photo:Instagram)
4/ 9
అయితే ఇప్పుడు ఉర్ఫీజావెద్ను మించిన మరో కళాకారుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు. నేనావత్ తరుణ్ అనే డిజిటిల్ మీడియా క్రియేటర్ అచ్చం ఉర్ఫీజావెద్ వేసుకున్నట్లుగానే డిఫరెంట్ డిజైనర్ కాస్ట్యూమ్స్ వేసుకొని డ్యాన్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. (Photo:Instagram)
5/ 9
మొదట టిక్ టాక్ స్టార్‌గా పాపులర్ అయిన తరుణ్..తన అడ్డగోలు క్రియేటివిటీని ఉపయోగించి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ద్వారా మిలియన్స్ సంఖ్యలో ఫాలోవర్స్‌ని సంపాదించుకున్నాడు. ఈ డిజిటల్ క్రియేటర్ వీడియోలకు వ్యూస్, లైక్‌లు కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. (Photo:Instagram)
6/ 9
ఒకప్పుడు ఏదైనా సాహసం, లేదంటే సోషల్ కాజ్‌తో కూడిన పనులు చేస్తే గుర్తింపు వచ్చేది. నేనావత్ తరుణ్ అనే డిజిటల్ క్రియేటర్‌ను చూస్తే ఈ 5G జనరేషన్లో కాదేది అనర్హం గుర్తింపునకు అన్నట్లుగా మారిపోయింది.(Photo:Instagram)
7/ 9
ప్రతి వస్తువును, కాయలు, ఆకులు,పండ్లు, చివరకు చిరిగిన పేపర్లు, గాజులు, చివరకు తినే వస్తువులను కూడా ఈ టిక్‌టాక్ స్టార్ డ్రెస్‌లుగా మార్చేసుకొని వాటితో డ్యాన్స్ చేయడం, క్యాట్‌వాక్ చేస్తూ వీడియోలను షేర్ చేయడం చేస్తున్నాడు. (Photo:Instagram)
8/ 9
హిందీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఉర్ఫీజావెద్ వేసుకునే డ్రెస్‌లు, ఆమె ఇచ్చే ఫోజులు చూస్తుంటే తరుణ్‌ని చూసి అలాంటి డ్రెస్‌లు వేసుకుంటే పాపులర్ అవుతామనే చేస్తోందని నెటిజన్లు ఫీలవుతున్నారు. వీళ్లిద్దరి డ్రెస్‌లు, ఫోటోలను మిక్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.(Photo:Instagram)
9/ 9
ఒకప్పుడు సోషల్ మీడియా అంటే అందరికి సమాచారం, సరదాలను షేర్ చేసుకునేందుకు వేదికగా ఉండేది. కాని ఇప్పుడు ట్రెండ్ మారింది. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ చాలా మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇంకొందరికైతే ఎక్కడా లేనంత గుర్తింపు తెచ్చిపెడుతోంది. (Photo:Instagram)