కొందరు యువత వింత పోకడలకు పోతున్నారు. ఒకే జెండర్ ఉన్నవారిని పెళ్లి చేసుకుంటున్నారు. అయితే, విదేశాలలో అనేక దేశాలలో ఇది పాటిస్తున్నారు. అయితే, దీని వలన అనేక సమస్యలు తలెత్తుతాయని పెద్దలు చెబుతున్నారు. ఇప్పటికి మన దేశంలో అనేక చోట్ల ఒకే జెండర్ వివాహాలు వెలుగులోనికి వస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్ లో ఈ వింత ఘటన వెలుగులోనికి వచ్చింది. ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకున్నారు.
ఇద్దరు అమ్మాయిలు ప్రతి రోజు కలుసుకునే వారు. ఎక్కడికి వెళ్లిన కలిసి వెళ్లేవారు. ఒకరిని విడిచి మరోకరు ఒక్క నిముషం కూడా ఉండేవారు కాదు. ఈ క్రమంలో వీరి మధ్య ప్రేమ చిగురించింది. పెద్దలు తమ ప్రేమ విషయాన్ని చెప్పారు. కానీ పెద్దలు దీనికి నిరాకరించారు. మరోకరిని తమ జీవితంలో ఊహించుకోలేక పోయారు. దీంతో యువతి ఒక నిర్ణయం తీసుకుంది. లింగ మార్పిడి చేసుకుని అబ్బాయిలా మారాలనుకుంది.
కొంత మంది పెళ్లికి అంగీకరించక పోతే.. లింగమార్పిడి సైతం చేసుకుంటున్నారు. తమకు ఇప్పటికే అమ్మాయిలు లింగ మార్పిడి చేసుకుని, అబ్బాయిలుగా మారిన అనేక సంఘటనలు జరిగాయి. అలాగే అబ్బాయిలు కూడా లింగ మార్పిడి చేసుకుని అమ్మాయిలుగా మారారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. ఇప్పటికే అనేక మంది అమ్మాయిలు లింగ మార్పిడి చేసుకుంటున్న ఘటనలు వార్తలలో ఉంటున్నాయి.
ఇలాంటి ఘటన యూపీలో జరిగింది. ఉత్తర ప్రదేశ్ లో ఇద్దర మ్మాయిల మధ్య పుట్టిన ప్రేమ గొడవలకు దారితీసింది. వీరి ప్రేమను ఇంట్లో వారు అంగీకరించలేదు. దీంతో యువతి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత.. తన గర్ల్ ఫ్రెండ్ తో జీవించడానికి లింగ మార్పిడి చేసుకుని పురుషుడిగా మారింది. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట వైరల్ గా మారింది.