ఆమె పెళ్లి మే 2వ తేదీన నిశ్చయించారు. అయితే అదే రోజు పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా జరుగుతుంది. దీంతో ఆ వధవు తన పెళ్లి వేడుకను మధ్యలో వదులుకుని కౌంటిగ్ జరుగుతున్న చోటుకి చేరుకుంది. ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆమె ఆనందరం రెట్టింపు అయింది. దీంతో విక్టరీ సర్టిఫికేట్ తీసుకోవడానికి ఆమె నవీన్ మండిలోని మత్గడ్నాకు చేరుకునింది. అక్కడ అధికారుల నుంచి విక్టరీ సర్టిఫికేట్ను అందుకుంది.
ఈ సందర్బంగా ఆమె ప్రత్యేకంగా న్యూస్18తో మాట్లాడుతూ.. తాను బరేలి జిల్లాకు చెందిన రింకును పెళ్లి చేసుకుంటున్నట్టు తెలిపారు. పెళ్లి రోజు ఈ రకమైన ఆనందం ఎదురవుతుందని ఊహించలేదని చెప్పారు. తన ప్రత్యర్థి ముకేష్పై 31 ఓట్ల తేడాతో విజయం సాధించినట్టు చెప్పారు. తన ప్రాంతాన్ని అభివృద్ది చేయనున్నట్టు, సమస్యలను పరిష్కరించనున్నట్టు తెలిపారు.