UP cop loading gun video : పోలీసులకి గన్(Gun) వాడటం చేతకాదు అంటే కొంత ఆశ్చర్యపోవాల్సిందే. అయితే ముఖ్యంగా ఓ ఎస్ఐ(SI)కి గన్ లో బెల్లెట్లు ఎక్కడ ఉంటాయో కూడా తెలియదు అంటే ఇక ఆశ్చర్యం తప్ప ఇంకేం కలగదు. అయితే అక్కడ అక్కడ కొందరు జాతిరత్నాలు ఉంటారు. వీరిని చూస్తే అసలు వీరికి ఎవర్రా బాబు ఉద్యోగం ఇచ్చింది అని అనుకోక తప్పదు. అయితే ఉత్తరప్రదేశ్ లో ఓ ఎస్ఐ రైఫిల్‌ను లోడ్ చేయడంలో విఫలమయ్యాడంటూ చూపించే ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఉత్తరప్రదేశ్(UttarPradesh)లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లను గతేడాది డిసెంబర్ లో డీఐజీ ఆర్కే భరద్వాజ్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పోలీసుల సామర్థ్యాలను ఆయన పరీక్షించారు. ఆకస్మిక తనిఖీల్లో భాగంగా డీఐజీ ఆర్కే భరద్వాజ్..జిల్లాలో ఉన్న ఖలీలాబాద్ పోలీస్ స్టేషన్‌ను కూడా సందర్శించారు. ఈ సందర్భంగా ఖలీలాబాద్ పోలీస్ స్టేషన్‌లోని సబ్-ఇన్స్పెక్టర్ (SI)ను రైఫిల్ లోడ్ చేయాలని డీఐజీ ఆదేశించారు. అయితే ఆ ఎస్ఐ గన్ ను సరిగా పట్టుకోలేకపోయాడు. బుల్లెట్లను గొట్టం ద్వారా గన్ లోకి వేసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఐజీ నివ్వెరబోయారు. అక్కడే అసహనం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో అక్కడే ఒకరు తమ సెల్ ఫోన్ లో రికార్డు చేశారు. ఈ వీడియో తర్వాత సోషల్ మీడియాలోకి వచ్చింది. వావ్ యూపీ పోలీసులు అంటూ ఆ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. Viral Video: పిల్లితో మాట్లాడుతున్న సీఎం యోగి ఆదిత్యనాథ్..వీడియో వైరల్ योगी जी की पुलिस को बंदूक में गोली डालना भी नहीं आता! यूपी पुलिस बंदूक की नली से डाल रही गोली, चरम पर अज्ञानता। भाजपा सरकार में गरीबों और निर्दोषों का उत्पीड़न करने वाली अनुशासनहीन पुलिस के एसआई को बंदूक चलाना भी नहीं आता, शर्मनाक। ऐसे पुलिसकर्मियों से बेहतर होगी पुलिस फोर्स? pic.twitter.com/fbCMy5dmsy — Samajwadi Party (@samajwadiparty) December 28, 2022 ఆ వీడియోను సమాజ్ వాదీ పార్టీ ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. తుపాకీ బారెల్లోంచి బుల్లెట్‌ని చొప్పించిన యుపీ పోలీసులు అజ్ఞానానికి పరాకాష్ట. పేద, అమాయక ప్రజలను వేధిస్తున్న బీజేపీ ప్రభుత్వ క్రమశిక్షణ లేని పోలీసు ఎస్ఐకి తుపాకీ ఎలా ఉపయోగించాలో కూడా తెలియదు. ఇది చాలా అవమానకరం అని ట్వీట్ చేసింది. అయితే ఈ వీడియో వైరల్ అయిన తర్వాత వైరల్ అయిన వీడియోకు సంబంధించి సంత్ కబీర్ నగర్ పోలీస్ స్టేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. తుపాకీని సరిగ్గా లోడ్ చేయడంలో పోలీసు విఫలమయ్యాడని సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను పోలీస్ స్టేషన్ ఖండించింది. తనిఖీ సమయంలో ఉపయోగించిన రైఫిల్ అల్లర్ల నిరోధక(Anti-riot)తుపాకీ అని, ఇది యూజర్ ని బారెల్ ముందు నుండి ప్లాస్టిక్ పెల్లెట్ ను చొప్పించమని డిమాండ్ చేసే తుపాకీ అని తెలిపింది.