ఈ ప్రపంచంలో దైవం ఉంది అని నమ్మేవారు ఉన్నట్లే.. దెయ్యాలు ఉన్నాయి అని నమ్మేవారూ ఉన్నారు. అలాంటి వారికి నచ్చే ఆలయం బీహార్.. గోపాల్‌గంజ్‌లో ఉంది. ఇది థావే బ్లాక్‌లోని లచ్వార్ గ్రామంలో... గోపాల్‌గంజ్ జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి 12 కి.మీ దూరంలో ఉంది. ఆలయ కమిటీ ఇక్కడ మీడియా ప్రవేశంపై నిషేధం విధించింది. ఐతే తొలిసారిగా వాసంతిక్ నవరాత్రుల సందర్భంగా అనుమతి ఇవ్వడంతో... న్యూస్-18 బృందం ఆలయానికి చేరుకుంది. ఆలయ ప్రాంగణంలో రకరకాల మూఢ నమ్మకాలు కనిపించాయి.
ఇది ప్రజల విశ్వాసం అనుకోండి.. లేక మూఢనమ్మకం అనుకోండి.. ఏమైనా.. దాదాపు 2 వందల ఏళ్లుగా ఏటా లచ్వార్ గ్రామంలో ఈ జాతర జరుగుతుంది. అక్కడికి వచ్చే కొందరు దెయ్యం తమపై కూర్చుందని అంటారు. మరికొందరు తమకు దెయ్యం పట్టిందేమో అనే డౌట్‌తో ఉంటారు. ఇంకొందరు శ్మశానవాటిక పక్కనుంచి వెళుతుండగా తమకు దెయ్యం పట్టిందని చెబుతుంటారుచ. ఇంకొందరు స్త్రీల చేతికి ఇనుప సంకెళ్లు వేస్తారు.
మూఢనమ్మకాలతో కూడిన ఈ జాతరలో దెయ్యాల్ని వదిలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెబుతారు. దెయ్యాలు పట్టిన వాళ్లను వదిలించేందుకు ఈ ఆలయమే సరైనదని వారు చెబుతారు. , ఉత్తరప్రదేశ్‌తో పాటు, పొరుగు దేశం నేపాల్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో మహిళలు, పురుషులు, పిల్లలు ఇక్కడికి వస్తారు. పిల్లలు కలగని భక్తులు కూడా ఇక్కడికి వస్తుంటారు.