రేవాన్, కక్వారా గ్రామాల్లో ఓ ఆడ కుక్క నివసించేది. ఏ వేడుక జరిగినా ఆహారం కోసం అది వచ్చేదని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. ఒకసారి రేవాన్ గ్రామంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. తిండి కోసం ఆ కుక్క ఈ గ్రామానికి చేరుకుంది. కానీ అప్పటికే అక్కడ భోజనం అయిపోయింది. ఆ తరువాత అది... కక్వారా గ్రామానికి వెళ్లింది. అక్కడ కూడా దానికి ఆహారం దొరకలేదు. చివరికి అది ఆకలితో చనిపోయింది.
ఆ కుక్క చనిపోవడం చూసి రెండు గ్రామాల ప్రజలూ తీవ్ర మనోవేదన చెందారు. తర్వాత రెండు గ్రామాల సరిహద్దులో కుక్కను పాతిపెట్టి... కొంత కాలం తర్వాత అక్కడే గుడి కట్టారని.. ఆ ప్రాంతంలో నివసిస్తున్న చరిత్ర నిపుణుడు హరగోవింద్ కుష్వాహా చెబుతున్నారు. ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాలలో ఏదైనా కార్యక్రమం జరిగితే, ప్రజలు ఈ ఆలయానికి వెళ్లి ఆహారాన్ని సమర్పించడం సంప్రదాయం.