ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఇక సినిమాలలో వేరే చెప్పాలా..? అబ్బో.. ఇద్దరు ప్రేయసుల మధ్య నలిగే ప్రేమికుడు.. లేదా ఇద్దరు ప్రేమికుల మధ్య నలిగే ప్రేయసి.. దీనికి తోడు మన దర్శకదిగ్గజాలు మాంచి మసాలా వేసి దట్టించే సీన్లు.. డ్రామా.. పాటలు.. విరహ వేదన.. ఆ ఫీలింగే వేరు. ఈ తరహా కథాంశంతో వచ్చిన సినిమాలేవీ ఫ్లాఫ్ అయిన సందర్భాలు చాలా తక్కువ. అయితే ఈ సినిమాలన్నింటిలో.. హీరో గానీ, హీరోయిన్ గానీ ఎవరినో ఒకరినో పెళ్లి చేసుకుంటారు. మూడో వ్యక్తి పక్కకు తప్పుకుంటాడు. అది సినిమా ధర్మం. లేకుంటే మన ప్రేక్షకులు జీర్ణించుకోలేరు.
'మాకు ముగ్గురు వ్యక్తుల మధ్య సంబంధం ప్రశ్న కాదు. మా మధ్య కెమిస్ట్రీ చాలా బలంగా ఉంది. గొప్ప విషయం ఏమిటంటే, అవతలి వ్యక్తి ఏమి ఆలోచిస్తున్నాడో లేదా అనుభూతి చెందుతున్నాడో మనం అర్థం చేసుకోగలం. ఈ భావన వర్ణించడానికి పదాలు చాలవు..’ అని చెప్పుకొచ్చింది ఓల్గా.. ప్రస్తుతుం ప్రాన్స్ లో నివసిస్తున్న ఈ జంట.. త్వరలోనే పిల్లలను కనాలని అనుకుంటుంది.