వివాహం అయిన తర్వాత జంటలు హనీమూన్ కి వెళ్లడం కామన్. నేటి రోజుల్లో చాలామంది హనీమూన్ కోసం విదేశాలకు ఎక్కువగా వెళ్తున్న విషయం తెలిసిందే. పెళ్లి అయిన తర్వాత దంపతుల మధ్య బాండింగ్ పెరగడానికి హనీమూన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే ఎవరైనా ఏ చల్లటి ప్రదేశానికో,ఏ మంచుకురిసే ప్రాంతానికో వెళ్లాలనుకుంటారు కానీ ఓ వ్యక్తి మాత్రం అందుకు భిన్నంగా మండిపోయే ఎండ ఉండే సహారా ఎడారిలోకి వెళ్లి..అక్కడ హనీమూన్ ఫోటో చేయించుకొని వార్తల్లో నిలిచాడు.
క్రొయేషియా దేశానికి చెందిన ఫేమస్ ట్రావెలర్స్ క్రిస్టిజన్ ఇలిసిక్- ఆండ్రియా ట్రిగోవ్సెవిక్ తమ వివాహం తర్వాత ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రైలు ప్రయాణంలో ఈ జంట ఫొటోషూట్ కోసం 20 గంటల సమయం గడిపారు. పరిగణించబడే 2 కి.మీ పొడవైన గూడ్స్ రైలులో ఫోటోషూట్ చేయించుకున్నారు. రైలు లోపల బొగ్గు నింపి ఉండగా అందులో తమ ఫోటోషూట్ చేయించుకున్నారు. ఈ సమయంలో రైలు ప్రయాణిస్తున్న ఎడారి ప్రాంతంలో ఉదయం పూట ఉష్ణోగ్రత 45 డిగ్రీలు ఉండగా రాత్రిపూట సున్నా డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయి.
ఈ జంట తమ ఫొటోలను @lucky_m_e అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశారు. ఈ ఫొటోలు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి. ఫొటో షూట్ సమయంలో ఇద్దరూ తమ వివాహ దుస్తులను ధరించాడు. అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, ఈ సమయంలో వరుడు రైలు రెండు బోగీల మధ్య నిలబడి వధువును ఎత్తుకొని ఫొటోలకు ఫోజులిచ్చాడు. ఈ ఫొటో షూట్ ప్రయాణానికి మొత్తం 20 గంటల సమయం తీసుకున్నారు. 150 దేశాలను సందర్శించిన క్రిస్టియన్ ఇలిసిక్ ఇది చాలా ప్రత్యేకమైన అనుభవంగా అభివర్ణించారు. ఫొటో షూట్ సమయంలో వాతీవరణ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని..తమ శరీరమంతా మట్టితో నిండిపోయిందని తెలిపాడు.