Hogenakkal Falls Pics : తుఫాను వల్ల తమిళనాడులో జోరుగా వర్షాలు కురవడంతో.. కావేరీ నదిపై ఉన్న హొగెనక్కల్ జలపాతం జోరుగా ప్రవహిస్తోంది. పర్యాటకులు పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. ఆ ఫొటోలు చూద్దాం. (Images - Sukumar - Dharmapuri)
Hogenakkal Falls Pics : దేశంలోని అందమైన జలపాతాల్లో ఒకటి హొగెనక్కల్. తమిళనాడు.. ధర్మపురి జిల్లాలోని కావేరీ నదిపై ప్రవహిస్తోంది ఈ సుందరమైన జలపాతం. తాజాగా కురిసిన వర్షాలతో దీనికి మళ్లీ ప్రవాహం పెరిగింది.
2/ 9
ప్రస్తుతం ఈ జలపాతంలో నీరు సెకండ్‌కి 8వేల క్యూబిక్ ఫీట్ వెళ్తోంది. ఈ ప్రవాహ వేగాన్ని అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.
3/ 9
హొగెనక్కల్ జలపాతపు చుట్టుపక్కల ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. ఆ వరద నీరంతా ప్రవాహంలా మారి.. జలపాతంలో చేరుతోంది.
4/ 9
వర్షాకాలంలో ఈ జలపాతం అత్యంత ఉద్ధృతంగా ఉంటుంది. ఐతే.. చలికాలంలో ఇందులో నీటి ప్రవాహం పెద్దగా ఉండదు. తాజా వర్షాలతో ప్రవాహం పెరగడంతో.. పర్యాటకులు దీన్ని చూసేందుకు తరలి వెళ్తున్నారు. కొంతమంది టూరిస్టులు జలపాతంలోకి దిగి స్నానాలు చేస్తూ జలకాలాడుతున్నారు.
5/ 9
నిన్న, మొన్న వీకెండ్ కావడంతో.. జలపాతానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలోనే వచ్చారు. తుఫానును కూడా వారు లెక్క చెయ్యలేదు.
6/ 9
జలపాత ప్రాంతంలో రెండ్రోజులు వర్షం కురిసింది. ఆదివారం మాత్రం కాస్త తగ్గింది. అందువల్ల పర్యాటకులు బాగా వచ్చారు. ఐతే.. జలపాతం చెంత విపరీతమైన చల్లదనం ఉంది.
7/ 9
జలపాతాన్ని చూసిన పర్యాటకులు ఆ తర్వాత పరైసల్ ట్రిప్‌కి వెళ్తున్నారు. అక్కడ రకరకాల చేప కూరలు, ఫ్రైలను టేస్ట్ చూస్తున్నారు.
8/ 9
హొగెనక్కల్ జలపాతం దగ్గర పర్యాటకుల సందడి
9/ 9
సడెన్‌గా టూరిస్టుల సంఖ్య పెరగడంతో చిరు వ్యాపారులు, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.