టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ వైల్డ్ యానిమల్స్‌తో జాలీగా గడిపాడు. చూస్తేనే వెన్నులో వణుకు పుట్టించే కృరమృగాలుండే జూలోకి ఎంటరైన లైగర్ వాటితో చాలా సేపు సరదాగా ఆడుకున్నాడు. ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. (Photo:Instagram)
2/ 11
హాలీడే ట్రిప్‌ని తెగ ఎంజాయ్ చేస్తున్నాడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతం దుబాయ్ వెకేషన్లో ఉన్న అర్జున్‌రెడ్డి ..తన ట్రిప్‌ని ఎంతో జాలీగా , చాలా హ్యాపీగా గడిపేస్తున్నాడు. (Photo:Instagram)
3/ 11
అతి పెద్ద కొండచిలువలు, పులులు, సింహాలు ఉన్న జూలోకి ఎంటరైన విజయ్‌దేవరకొండ అక్కడి క్రూరమృగాలతో కాసేపు ఆడుకున్నాడు. అక్కడున్న జూ సిబ్బంది హీరోలోని ధైర్యవంతుడ్ని బయటకు తీశారు.(Photo:Instagram)
4/ 11
పులి పిల్లలకు పాలు పట్టించడం, సింహపు పిల్లల్ని వెంట తిప్పుకోవడం, సింహంతో డూ ఆర్ డై ఆటలాడటం వంటి వీడియోని తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. (Photo:Instagram)
5/ 11
ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉన్న భారీ కొండ చిలువను మెడలో వేసుకొని నవ్వుతూ ఫోటోలకు ఫోజులిచ్చాడు గీత గోవిందం హీరో. లైగర్ ఫ్లాప్‌తో ఖుషీ సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ..రియల్ లైఫ్‌లో కూడా ఖుషీగా ఉండేందుకు ఈ విధంగా ట్రై చేస్తున్నట్లుగా ఉన్నాడు. (Photo:Instagram)
6/ 11
అందమైన గార్డెన్ అందులో రామచిలుకలు, విచిత్రమైన జంతువులను చూడటం చాలా హ్యాపీగా ఉందంటూ తన స్వీట్మెమరీస్ని షేర్ చేసుకున్నాడు యంగ్ స్టార్. అంతే కాదు పాములంటే భయపడే తనకు ఆ భయాన్ని పోగొట్టారంటూ జూ సిబ్బందికి థ్యాంక్స్ చెప్పాడు. (Photo:Instagram)
7/ 11
తాను సింహం, పులి పిల్లలతో మాట్లాడటానికి సహాయపడిన జూ సిబ్బంది, క్యూరేటర్స్కి స్పెషల్ థ్యాంక్స్ చెబుతున్నానని కామెంట్స్ షేర్ చేశాడు. నా లైఫ్‌లో ఇదో తీపి జ్ఞాపకమని క్యాప్షన్ కూడా పెట్టాడు. (Photo:Instagram)
8/ 11
దుబాయ్‌లోని జూలో సంరక్షకులుగా ఉన్న ఎస్బీ బెల్హాసా, పార్క్ సిబ్బంది తనకు వైల్డ్ యానిమల్ జూ, పార్క్‌లో అక్కడి జంతువులు, విషయాలను పూర్తిగా చెప్పి తనలో భయం పోగొట్టారని మెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ.(Photo:Instagram)
9/ 11
లైగర్ ఫ్లాప్‌తో చాలా కాలంగా వార్తల్లో లేకుండా సైలెంట్‌గా ఉన్న విజయ్‌దేవరకొండ రీసెంట్గా క్రూరమృగాలతో సరదాగా గడిపిన వీడియోని తన ఇన్స్టాహ్యాండిల్లో షేర్ చేయడంతో ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. (Photo:Instagram)
10/ 11
వీడియో షేర్ చేసిన కొద్ది గంటల్లోనే నాలుగు లక్షల 87వేల లైక్‌లు వచ్చాయి. ఇక కామెంట్స్ అయితే విజయ్ యువర్ గ్రేట్ అంటూ..కొందరు..ఇంకొందరు నువ్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నావ్ అన్నా ..మేం మాత్రం నీ సినిమా కోసం ఎదురుచూస్తున్నామంటూ కామెంట్స్ షేర్ చేస్తున్నారు. (Photo:Instagram)
11/ 11
లైగర్ ఫ్లాప్‌తో ఢీలా పడిన విజయ్‌దేవరకొండ...కనీసం ఈవిధంగానైనా మళ్లీ యాక్టివ్‌గా జాలీగా మారేందుకు జూలు, వెకేషన్ ట్రిప్‌లు వేస్తున్నాడని మరికొందరు నెటిజన్లు తమ ఫీలింగ్స్‌ని షేర్ చేస్తున్నారు. (Photo:Instagram)