ఓటరు న‌మోదుకు చివరి అవకాశం -ఇప్పుడు మిస్ అయితే అంతే -Voter Registration ఇలా ఈజీగా

కొత్త ఓటర్ల నమోదు, పాత ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులకు సంబంధించి ప్రక్రియ మంగళవారం(ఇవాళ్టి)తో ముగియనుంది. 2021 సంవత్సరానికి చెందిన ముసాయిదా ఓటరు జాబితాను భారత ఎన్నికల సంఘం నవంబర్‌ 1న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ జాబితాలో పేరు, అడ్రస్‌కు సంబంధించి మార్పులు చేర్పులు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఇప్పుడు ఓటరుగా నమోదు కాని వాళ్లు మళ్లీ ఏళ్ల పాటు ఎదురుచూడాల్సి ఉండొచ్చు. ఓటరు రిజిస్ట్రేషన్ ఈజీగా ఎలా చేసుకోవాలంటే..