Tirumala Snake: తిరుమలలో పాము కలకలం... భయంతో పరుగులు తీసిన భక్తులు
Tirumala Snake: తిరుమలలో పాము కలకలం... భయంతో పరుగులు తీసిన భక్తులు
Tirumala Snake: తిరుమలలో తరచుగా పాములు, అడవి జంతువులు వంటివి వస్తున్నాయి. ఎంత జాగ్రత్తగా ఉంటున్నా... ఇలాంటివి వస్తుండటం భక్తులకు టెన్షన్ తెప్పిస్తోంది.
TTD: తిరుమల శ్రీవారి ఆలయం అంటే... భక్తులకే కాదు జీవరాశికీ తెగ నచ్చేస్తోంది. అక్కడి పచ్చటి ప్రకృతిలో ప్రాణులు హాయిగా జీవిస్తున్నాయి. అప్పుడప్పుడూ అవి భక్తుల దగ్గరకు వచ్చేస్తున్నాయి.
2/ 15
తాజాగా శ్రీవారి ఆలయ మహాద్వారానికి కొద్ది దూరంలోనే రెండున్నర అడుగుల పాము కనిపించింది. దాన్ని చూసిన భక్తులు భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు.
3/ 15
అక్కడే విధుల్లో వున్న భద్రతా సిబ్బంది వెంటనే అక్కడికి వెళ్లి ఎలాగొలా పాముపై ప్లాస్టిక్ బిన్ను కప్పారు.
4/ 15
అటవీ సిబ్బందికి సమాచారం ఇవ్వగా... ఘటనా స్థలానికి చేరేందుకు వారు బయల్దేరారు.
5/ 15
వారు వచ్చే వరకూ పాము బయటకు రాకుండా పైనే ఓ రాయిని ఉంచారు.
6/ 15
ప్లాస్టిక్ బిన్ దగ్గరకు వచ్చిన అటవీ సిబ్బంది... ప్రత్యేక పరికరాలతో పామును బంధించాలనుకున్నారు.
7/ 15
మెల్లగా బిన్ను పైకి ఎత్తారు.
8/ 15
పాము బయటకు రావడానికి ప్రయత్నించింది.
9/ 15
బయటకు వచ్చిన పాము పారిపోదామనుకుంది. కానీ వాళ్లు పరికరాలతో పట్టుకున్నారు.