Tirumala Temple: వడ్డీకాసుల వాడికి కానుకల వర్షం...రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం
Tirumala Temple: వడ్డీకాసుల వాడికి కానుకల వర్షం...రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం
Tirumala Temple | వడ్డీ కాసుల వాడికి భక్తులు కొలిచే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం, ఇతర కానుకలు జులై మాసంలో రికార్డు స్థాయిని చేరాయి. భక్తులు తిరుమల శ్రీవారికి కానుకల వర్షం కురిపిస్తున్నారు.
1/ 5
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారికి భక్తులు కాసుల వర్షం కురిపిస్తున్నారు. స్వామివారి ఆదాయం జులై మాసంలో రికార్డు స్థాయికి చేరింది.
2/ 5
హుండీ ఆదాయం, ఇతర కానుకల ద్వారా జులై మాసంలో వడ్డీకాసుల వాడికి రూ.106.28 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఏడాది తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం ఓ నెలలో రూ.100 కోట్లు దాటడం ఇది మూడోసారి.
3/ 5
మార్చి నెలలో స్వామివారికి రూ.105.8 కోట్ల ఆదాయం సమకూరగా...జూన్లో రూ.100 కోట్ల మేర ఆదాయం వచ్చింది.
4/ 5
ఇటీవల కాలంలో చాలా రోజుల్లో స్వామివారి రోజువారీ హుండీ ఆదాయం రూ.3-4 కోట్లు దాటుతోంది.
5/ 5
ఈ ఏడాది చివరి నాటికి స్వామివారి ఆదాయం రూ.1200 కోట్లకు చేరవచ్చని టీటీడీ అధికారులు అంచనావేస్తున్నారు.