ఎంత వర్షం పడిన.. కొంత మంది ఉద్యోగాలకు, వ్యాపారాలకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే, వారు రెయిన్ కోట్ లు, గొడుగులు వాడటం మనకు తెలిసిందే. కొంత మంది తమ ఫోన్ లు నీటిలో తడవకుండా గ్లాస్ లు, పౌచ్ లు ఉపయోగిస్తుంటారు. మరికొందరు ప్లాస్టిక్ కవర్ లను కూడా వినియోగిస్తుంటారు. కొన్ని సార్లు.. వీటి నుంచి కూడా నీళ్లు ఫోన్ లోపలికి వెళ్తాయి.
మొబైల్ ఫోన్ నీటిలో తడిస్తే.. వెంటనే దాన్ని స్విచ్ ఆఫ్ చేయాలి. దానిలోని బ్యాటరీని, మెమోరీ కార్డుని సపరేట్ చేయాలి. ఒక కవర్ లో బియ్యం తీసుకొవాలి. బియ్యానికి నీటిని, తేమను గ్రహించే శక్తి ఉంటుంది. ఫోన్ ను బియ్యంలో కప్పివేయాలి. అలా ఐదారు గంటల పాటు ఉంచిన తర్వాత.. ఫోన్ లోని నీటిని, తేమను బియ్యం లాగేసుకుంది.
మెల్లగా ఫోన్ ను బయటకు తీసి స్విచ్చాన్ చేయాలి. ఆ తర్వాత.. బ్యాటరీ వేసి, చార్జింగ్ కు పెట్టాలి. అప్పుడు ఫోన్ మునుపటిలాగా పనిచేస్తుంది. అయితే, వర్షం పడినప్పుడు ఫోన్ కు ప్రత్యేకంగా కవర్ కూడా పెట్టుకొవాలి. వీలైనంత వరకు వర్షం లో ఉన్నప్పుడు ఫోన్ వాడకాన్ని అవాయిడ్ చేయాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే.. ఫోన్ బాగా పనిచేస్తుంది.