ఇప్పుడు ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లను ఆ యువకుడు పెళ్లి చేసుకోబోతున్నాడు. కెన్యా నివాసి అయిన స్టీవో అనే యువకుడు..కేట్, ఈవ్, మేరీ అనే ముగ్గురు కవల సోదరీమణులను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఏప్రిల్ లో వీరి వివాహం జరుగనుంది.ఈ విషయాన్ని వీరే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో ప్రకటించారు. ముగ్గురికీ ప్రేమను ఇవ్వడం తనకు కష్టమైన పని కాదని స్టీవో చెప్పాడు.(Photo-instagram/comrades_triplets)
ఓ ఇంటర్వ్యూలో స్టీవో మాట్లాడుతూ.."నా ప్రేమ ఎప్పుడూ ఒక అమ్మాయి కోసం కాదని నేను నమ్ముతున్నాను. నేను చాలా పెళ్లిళ్లు చేసుకునే వ్యక్తిగా పుట్టాను. నేను ఎప్పుడూ నిజాయితీగా,విధేయుడిగా ఉంటాను. అందుకే నా మునుపటి స్నేహితురాళ్ళు నన్ను విడిచిపెట్టారు. ఎందుకంటే నాకు మరో భార్య కావాలి అని చెప్పాను"అని అన్నారు.(Photo-instagram/comrades_triplets)
ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు టైమ్ టేబుల్ కూడా తయారు చేసుకున్నారని అంటున్నారు. ఇందులో స్టీవోతో రాత్రి గడపడానికి డేట్స్ ఫిక్స్ అయ్యాయి. ముగ్గురు సోదరీమణులను సంతోషంగా ఉంచుతున్నట్లు స్టీవో చెప్పారు. అతను సోమవారాల్లో మేరీతో, మంగళవారాల్లో కేట్ మరియు బుధవారాల్లో ఈవ్తో ఉంటాడు. తర్వాత వారాంతంలో నలుగురూ కలిసి జీవిస్తారు.(Photo-instagram/comrades_triplets)
కెన్యా నివాసి అయిన స్టీవో.. 'నాకు మోసం చేయడం ఇష్టం లేదు, నాకు మూడే కావాలి, నేను కోరుకునేంత వరకు నాకు ఈ ఆశీర్వాదం ఉంది అని చెప్పాడు. దాదాపు రెండు నెలలు నుంచి మేము నలుగురం రోజంతా కలిసి ఉన్నాము. ప్రతి ఒక్కరూ ఒకరి నుండి ఒకరు నేర్చుకుంటున్నారు, వారి సమయాన్ని వెచ్చిస్తున్నారు.(Photo-instagram/comrades_triplets)