Job Alert : చెప్పులేసుకుని చప్పుడు చేయకుండా కూర్చుంటే చాలు.. ప్రతినెలా చెక్కులిచ్చేస్తారట..
Job Alert : చెప్పులేసుకుని చప్పుడు చేయకుండా కూర్చుంటే చాలు.. ప్రతినెలా చెక్కులిచ్చేస్తారట..
ఏం పని చేయకుండా డబ్బులు సంపాదించడం ఒక కళ. అయితే ఇది చాలా కష్టం. దానికి దొంగతనమో లేదా మోసమో చేయాలి. అలా కాకుండా ఏదైనా సంస్థ మీకు అసలు ఏం పని చెప్పకుండా ఉద్యోగం ఇస్తే.. ఊరికే ఏం కాదు లెండి.. జీతానికే.. ఏం పని చేయించుకోకుండా జీతమెలా ఇస్తారు అనుకుంటున్నారా..? అయితే ఇది చదవండి.
కరోనా కారణంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. అంతే కాదు, వారు ఆర్థికంగా చితికిపోతున్నారు. ఈ నేపథ్యంలో బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక షూ కంపెనీ మీకోసం బెస్ట్ ఆఫర్ ప్రకటించింది.
2/ 6
బ్రిటిష్‌కు చెందిన బెడ్రూమ్ అథ్లెటిక్ ఏజెన్సీ అనే సంస్థ చెప్పులు, షూల తయారీలో పేరుగాంచిన సంస్థ. అయితే ఈ సంస్థ తాను తయారుచేసిన బూట్లను రోజు మొత్తంలో సగం అంటే.. 12 గంటల పాటు ధరించడం వల్ల భారీ జీతం ఆఫర్ చేస్తున్నది.
3/ 6
ఆసక్తిగల అభ్యర్థులు ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చునని కంపెనీ వెబ్ సైట్ లో పేర్కొంది. ఇందులో ఉద్యోగం చేయడం చాలా ఈజీ. వాళ్లు అందించే చెప్పులు లేదా షూల నాణ్యతను తనిఖీ చేయడం.
4/ 6
చెప్పులేసుకుంటే ఏమొస్తుంది.. మళ్లీ వాటిని వేసుకుని గంటల పాటు ఊరికే కూర్చోవాలా..? ఏమిస్తారేంటి అనుకుంటున్నారా..? జీతం భారీగానే ఉంది లెండి. ఈ పనికి ఏడాదికి గానూ జీతం రూ. 4 లక్షల దాకా ఇస్తోంది సదరు సంస్థ.
5/ 6
అంతేకాదు.. లక్కీ కస్టమర్ కు 12 నెలల పాటు (ఏడాది దాకా) 12 జతల షూ, చెప్పులను కూడా ఉచితంగానే అందజేయనుంది.
6/ 6
మరింకెందుకాలస్యం. కంపెనీ వెబ్ సైట్ ఓపెన్ చేసి అప్లికేషన్ ఫామ్ నింపేయండి. మంచి తరుణం మించినా దొరకదు. ఏం పని లేకుండా హాయిగా జీతమిస్తానంటే ఎవరు వద్దంటారు..? ఎవరు వదులుకుంటారు..?