ఆ ఇంటి బెడ్ రూమ్ లో ఓ 50 ఎంఎల్ బాటిల్ ఉంది. స్కూలుకు వచ్చే పిల్లలంతా శానిటైజర్ బాటిల్ తెచ్చుకోవాలని టీచర్లు చెప్పారు. దాంతో... ఇంట్లోని చిన్నారి... ఆ లిక్విడ్ బాటిల్ పట్టుకుపోయింది. అది శానిటైజర్ అనుకుంది. దాన్ని తీసుకెళ్తున్నట్లు తల్లికి చెప్పలేదు. దాన్ని స్కూలుకు పట్టుకెళ్లి... తను చేతులకు రాసుకొని... తన ఫ్రెండ్సుకి కూడా షేర్ చేసింది.
ఈ ఘటనలో తల్లి పేరు ల్యూసీ హోస్సీ. స్కాట్లాండ్ లో ఉంటోంది. ఆమెకు ముగ్గురు పిల్లలు. ఓ కూతురు, ఇద్దరు కొడుకులు. ముగ్గురిలోకీ పాపే చిన్నది. జాబ్ చేస్తున్న ఆ తల్లికి స్కూల్ నుంచి వచ్చిన పాప షాక్ ఇచ్చింది. పాప డ్రెస్ ని లాండ్రీ ఇద్దామని చూసిన తల్లికి... ఆ యూనిఫామ్ లోని పాకెట్ లో ఆ బాటిల్ కనిపించింది. అంతే... దాన్ని చూడగానే తల్లి షాకైంది.
చూడ్డానికి అది శానిటైజర్ బాటిల్ లాగే ఉంటుంది. కానీ అది శానిటైజర్ కాదు. శృంగారంలో పాల్గొనేటప్పుడు ఆ లిక్విడ్ ఉపయోగిస్తారు. అదో హాట్, స్మూత్ మెటీరియల్. వేడి పుట్టిస్తుంది. అలాంటి దాన్ని ఆ చిన్నారి.... తెలియక... తన చేతులకు రాసుకొని... మిగతా ఫ్రెండ్సుకి కూడా ఇచ్చింది. పాప తల్లి అలాంటివి రెండు బాటిళ్లు కొంది.
ఆ బాటిళ్లు పాపకు కనిపించేలా ఉంచడం తల్లి చేసిన తప్పైంది. వాటిని స్కూలుకు తీసుకెళ్లకూడదు అని చెప్పాల్సిన ఆమె... అలా చెప్పలేదు. ఇప్పుడు ఇదెందుకు తీసుకెళ్లావు అంటే... ఆ పాప... శానిటైజర్ తప్పక తెచ్చుకోవాలని టీచర్ చెప్పారు అంది. ఇది అది కాదు... అంటే... పాపేమో... మరి ఇది ఏంటి అని అడిగింది. అది ఏంటో ఎలా చెప్పాలో తల్లికి అర్థం కాలేదు. పాపేమో... దాన్ని తన ఫ్రెండ్స్ అందరికీ ఇచ్చానని చెప్పి... మరో షాక్ ఇచ్చింది.