Krishna Janmashtami 2020 : జన్మాష్టమి... శ్రీకృష్ణుడికి నైవేద్యంగా సమర్పించే పదార్థాలు ఇవే
Krishna Janmashtami 2020 : జన్మాష్టమి... శ్రీకృష్ణుడికి నైవేద్యంగా సమర్పించే పదార్థాలు ఇవే
Janmashtami : చెడును అంతమొందించి... మంచిని పెంచేందుకు వచ్చిన అవతారమూర్తి శ్రీకృష్ణుడు. మరి ఆ నల్లనయ్యకు మనం ఏమి ఇవ్వాలి? ఏ నైవేద్యం సమర్పిస్తే... గోపాలుడు సంతృప్తి చెంది... వరాలిస్తాడు? శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆ విశేషాలు తెలుసుకుందాం.
మనం ప్రతి రోజూ శ్రీకృష్ణుడికి పూజలు చేస్తూనే ఉంటాం. కానీ జన్మాష్టమి సందర్భంగా చేసే పూజలకు ఎంతో విశిష్టత, విశేషం ఉంటుంది. శ్రీకృష్ణుడికి ప్రత్యేకంగా పెట్టే నైవేద్యం ఆయనకు ఎంతో ఇష్టం.
2/ 7
వెన్న - గోపాలుడికి చిన్నప్పటి నుంచే వెన్న తినే అలవాటుంది. ఆయన్ని వెన్న దొంగ అని కూడా అంటారు. శ్రీకృష్ణుడికి వెన్న తినడం అంటే చెప్పలేనంత ఇష్టం. జన్మాష్టమి ప్రసాదాల్లో వెన్న తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.
3/ 7
ధాన్యాలు, పాలు, తేనె, గడ్డ పెరుగు, బెల్లం... వంటి వాటితో చేసే ప్రసాదమంటే గోపాలుడికి ఎంతో ఇష్టం. చరణామృత కృష్ణుడు వాటిని తనివితీరా తినేస్తాడు. అందువల్ల వాటిని కూడా నైవేద్యంగా పెట్టవచ్చు.
4/ 7
జన్మాష్టమి రోజున పాయసం తప్పనిసరిగా చేసుకోవాలి. ఎందుకంటే... శ్రీకృష్ణ భగవానుడికి పాయసమంటే ప్రాణం. ఎంత ఇచ్చినా ఆరగించేస్తారు. అందువల్ల స్వామి వరాలివ్వాలంటే... పాయసం సమర్పించాల్సిందే!
5/ 7
బాదం, జీడిపప్పు వంటి పప్పులతో చేసిన లడ్డూలంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం. అవి గానీ నైవేద్యంలో పెట్టారంటే... ఇక మీ ఇంట్లోనే ఉండిపోతాడు. అన్నీ తింటూ... మిమ్మల్ని ఆశీర్వదించేస్తారు స్వామి.
6/ 7
సగ్గుబియ్యంతో చేసే కిచిడీ అంటే... నల్లనయ్యకు చాలా ఇష్టం. జన్మాష్టమి పూజ చేసినప్పుడు... సగ్గుబియ్యంతో ఇలాంటి వంటకం ఏదైనా చేసి పెడితే చాలా మేలు జరుగుతుంది.
7/ 7
జన్మాష్టమి రోజున పూజలో కచ్చితంగా లడ్డూ ఉండేలా చేసుకోవాలి. అది ఏ లడ్డూ అయినా పర్వాలేదు. బట్... లడ్డూ లేకపోతే మాత్రం స్వామి అలుగుతారు. పక్కింటికి వెళ్లిపోతారు. సో, ఆయన్ని మన ఇంట్లోనే ఉండేలా చేసుకోవాలంటే... పూజలో రుచికరమైన లడ్డూలు ఉండేలా చూసుకోండి మరి.