థాయిలాండ్ అనగానే మనకు అక్కడి బ్లూ బీచ్‌లు, కొబ్బరి చెట్లు, మసాజ్ పార్లర్ల వంటివి గుర్తు రావడం సహజం. ఐతే.. థాయిలాండ్‌లో అద్భుతమైన బౌద్ధ ఆలయాలు ఉన్నాయి. వాటిలో ప్రత్యేకమైనది బీర్ బాటిళ్ల ఆలయం. మీరు ఎప్పుడైనా థాయిలాండ్‌కి వెళ్తే.. కొంత టైమ్ కేటాయించుకొని.. ఈ బీర్ బాటిల్స్ బౌద్ధ ఆలయానికి వెళ్లండి. చాలా బాగుంటుంది అని పర్యాటకులు చెబుతుంటారు.
ఈ పరిస్థితిని ఎలాగైనా మార్చాలని ఆలోచించిన బౌద్ధులు.. తాము బీర్ బాటిళ్లతో ఓ ఆలయం నిర్మిస్తామనీ.. ఖాళీ బాటిళ్లను తమకు ఇవ్వాలని కోరారు. ప్రపంచ పర్యాటకులు దీనికి పాజిటివ్‌గా స్పందించారు. అంతే.. లక్షల కొద్దీ బాటిళ్లు బౌద్ధులను చేరాయి. గ్రీన్ హీనెకెన్, బ్రౌన్ లోకల్ చాంగ్ బీర్ బాటిళ్లతో దీన్ని నిర్మించారు.