ఎవరికైనా సరే... పుట్టుకతో వచ్చేదే సరైన అందం. పైపై కనిపించే అందం కంటే... మనసులో ఉండేదే నిజమైన అందం. కానీ కొంత మంది మాత్రం తాము మరోలా పుట్టి ఉంటే బాగుండేదని భావిస్తారు. అలా కనిపించేందుకు సర్జరీలు కూడా చేయించుకుంటారు. అందుకోసం లక్షలు, కోట్లు ఖర్చు పెడతారు. చివరకు ఉన్న అందం కూడా పోయి... ట్రోలింగ్ అవుతారు. ఆస్ట్రియాకి చెందిన ఈ యువతి పరిస్థితి అలాగే తయారైంది. (image credit - instagram - jessy.bunny.official)
పేరు జెస్సీ బన్నీ (Jesse Bunny). పుట్టింది జర్మనీలో. ఉంటున్నది మాత్రం ఆస్ట్రియాలో. బార్బీ డాల్ (Barbie doll)లా కనిపించాలన్నది ఆమె కల. అందుకోసం సర్జరీ చేయించుకొని రూ.24 లక్షలు ఖర్చు పెట్టింది. కానీ తీవ్ర నిరాశ చెందింది. ఎందుకంటే... ఆ మూతి చూడండి... సర్జరీ తర్వాత అలా తయారైంది. (image credit - instagram - jessy.bunny.official)
ఈ మధ్య చాలా మందికి సహజంగా ఉండే అందాలు నచ్చట్లేదు. తెచ్చిపెట్టుకునే అందాల కోసం ఆరాటపడుతున్నారు. వాటివల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ సంగతి పట్టించుకోవట్లేదు. జెస్సీ విషయానికి వస్తే... చిన్నప్పటి నుంచి అతిగా లిప్‌స్టిక్, మేకప్‌లు వేసుకునేది. పేరెంట్స్ అంతలా వాడొద్దని చాలాసార్లు చెప్పారు. వినేది కాదు. కాస్ట్లీ కాస్ట్యూమ్స్ వాడేది. డబ్బును నీళ్లలా ఖర్చుపెట్టేది. (image credit - instagram - jessy.bunny.official)
సర్జరీ తర్వాత ఈమె అవతారం చూసి పేరెంట్స్ షాక్ అయ్యారు. ఇదంతా అవసరమా అంటే... అవసరమే అంది. ఇప్పుడే అంతా తనవైపు చూస్తున్నారనీ... అది తన కాన్ఫిడెన్స్ పెంచుతోందని అంది. ఆమెకు చెప్పడం వేస్ట్ అని తల్లిదండ్రులు ఇక సైలెంట్ అయ్యారు. ఇక తనకు ఫ్రీడమ్ వచ్చేసినట్లు ఫీలైన జెస్సీ తాను ఇంకా పూర్తిగా బార్బీ డాల్‌లా లేను అనుకుంది. (image credit - instagram - jessy.bunny.official)
పెదవుల్ని కాస్త మార్చితే... అచ్చం బార్బీడాల్‌లా ఉంటావని ఎవరో సూచన ఇచ్చారు. అంతే... వెళ్లి లిప్ సర్జరీ (lip surgery) చేయించుకుంది. అందుకు రూ.2 లక్షలు ఖర్చు పెట్టింది. ఆ తర్వాత లైపోసక్షన్ చేయించుకుంది. దానికో రూ.2 లక్షలు అయిపోయాయి. అలాగే గడ్డం, బుగ్గలకు కూడా సర్జరీలు చేయించుకుంది. అప్పటికీ తాను బార్బీలా లేను అనే ఫీలింగ్ ఆమెకు ఉంది. ఈమధ్య ఓ అడల్ట్ వీడియో ప్రొడక్షన్‌కి వెళ్తే... ఆమెను చూసి వాళ్లు షాక్ అయ్యారు. (image credit - instagram - jessy.bunny.official)
ఇలా బలవంతపు అందాలతో బార్బీలా మారాలనుకునే జెస్సీ ప్రయత్నాలు సక్సెస్ అవ్వకపోగా బూమరాంగ్ అయ్యాయి. ఇప్పుడందరూ ఆమె మూతినే చూస్తూ... అదేంటి అలా ఉంది... అలా ఎలా అయ్యింది... అని ఆశ్చర్యపోతున్నారు. దాంతో ఉన్న కాన్ఫిడెన్స్ పోగా... నిరాశలో కూరుకుపోతోంది జెస్సీ. (image credit - instagram - jessy.bunny.official)