కప్పడోసియా (cappadocia ) చాలా అందమైన నగరం. ఇక్కడ మీరు సూర్యుని కాంతిలో మరింత అందంగా ఎగురుతున్న పెద్ద బెలూన్లను చూడొచ్చు. అవి ఈ నగరానికి గర్వకారణం. గత సంవత్సరం వాటిని చూడటానికి 40 లక్షల మందికి పైగా పర్యాటకులు వచ్చారు. ఐతే ఈ నగరం మరో విషయానికి ప్రసిద్ధి చెందింది. ప్రపంచం నలుమూలల నుండి మహిళలు అక్కడికి వస్తుంటారు. ఎందుకో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. (Image credit - canva)
కప్పడోసియాలో భాగమైన అవ్నోస్ (Avanos)లో ఒక విచిత్రమైన హెయిర్ మ్యూజియం ఉంది. దాని పేరు చెజ్ గాలిప్ (Chez Galip). దాన్ని గాలిప్ స్థాపించాడు. ప్రతి సంవత్సరం వేల మంది పర్యాటకులు ఈ మ్యూజియాన్ని సందర్శిస్తారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులు తమ శరీరంలోని కొంత భాగాన్ని ఇక్కడ వదిలివేస్తారు. ఆ విధంగా ఇది చాలా ప్రసిద్ధి చెందింది. ఇది ప్రపంచంలోని 15 వింత మ్యూజియంలలో ఆరో స్థానంలో ఉంది. 16,000 కంటే ఎక్కువ మంది స్త్రీల వెంట్రుకలు ఇక్కడ ఉన్నాయి. (Photo-twitter-@salam_zx)
ఈ మ్యూజియం పేరు 1998లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చేరింది. ఈ స్థలం ఇప్పుడు చాలా మంది మహిళల జుట్టుతో నిండిపోయింది. ప్రతి సంవత్సరం ఈ మ్యూజియం యజమాని గాలిప్.. పర్యాటకుల పేర్లతో లాటరీని నిర్వహిస్తారు. 20 మంది అదృష్టవంతులు కప్పడోసియా విహారయాత్ర చేసే అవకాశం పొందుతారు. (Photo-twitter-@salam_zx)