చెదపురుగులకూ.. టెక్నాలజీకీ సంబంధం ఉంది అంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ భూమిపై మనుషుల కంటే చెదపురుగులు (termites) చాలా ఎక్కువగా ఉన్నాయి. అవి ఏటా సుమారు రూ.3,26,000 కోట్ల.. వ్యర్థాలను తింటున్నాయి. ఇవి కలపను ఎక్కువగా తింటాయి. కలప, గడ్డి నుంచి జీవ ఇంధనం (బయో ఫ్యూయల్) తీసేందుకు ఇవి ప్రేరణగా నిలుస్తున్నాయి.
చెదపురుగులు భూమికి కన్నాలు పెడతాయి. నేలను గుల్ల చేస్తాయి. తద్వారా మొక్కలు బాగా పెరిగేందుకు వీలవుతుంది. మొక్కల వేర్లు తేలిగ్గా నీటిని తీసుకునే వీలు కలుగుతుంది. సైంటిస్టుల ప్రకారం.. మైదానాలు.. ఎడారుల్లా మారకుండా.. చెదపురుగులు కాపాడుతున్నాయి. ఇవే లేకపోతే భూతాపం మరింత పెరిగేదంటున్నారు శాస్త్రవేత్తలు.
చెదపురుగులు చిన్న చిన్న కుప్పల లాంటి నిర్మాణాలు ఏర్పాటుచేసుకుంటాయి. మనం ఆ నిర్మాణాన్ని నాశనం చేస్తే.. అవి అదే మట్టితో మరో నిర్మాణం తయారుచేసుకుంటాయి. ఆ నిర్మాణాలు తేమను పట్టి ఉంచగలవు. చెదపురుగులకు వ్యాధులతో పోరాడే ట్రిక్స్ తెలుసు. అందుకే వాటిని వదిలించుకోవడం కష్టం. ఇవి సమూహంగా ఓ రకమైన నాలెడ్జ్ (group cognition) కలిగి ఉంటున్నాయి. అదేంటో, ఎలా సాధ్యమవుతోందో సైంటిస్టులకు ఇంకా అర్థం కాలేదు.
మనకు ఏమాత్రం కనిపించకుండా.. తమ పని తాము చేసుకుపోతున్న చెదపురుగులు.. సైంటిస్టులకు ప్రేరణగా నిలిచాయి. ఇప్పటివరకూ మనుషులు డ్యాములు, చమురు బావులు, డ్రిల్లింగ్, ఆయిల్, గ్యాస్ తవ్వకాలు, బొగ్గు గనుల్లో తవ్వకాలు, పైప్ లైన్ల నిర్మాణాలు ఇలా ఎన్నో చేశారు. ఇవన్నీ పెద్ద పెద్దవి. ఫ్యూచర్ మొత్తం స్మాల్ ఈజ్ బ్యూటీఫుల్ అనే పరిస్థితి. నానో రోబోలు, చిన్న సెన్సార్లు, చిన్న సన్నటి ఇలా. కాలం గడిచేకొద్దీ.. అన్నీ చిన్నగా అవుతున్నాయి. అందుకు చెదపురుగుల లైఫ్ స్టైల్ ప్రేరణగా నిలుస్తోంది. అవి చిన్నగా ఉంటూనే.. ఏం చెయ్యాలో అది చేసుకుంటూ పోతున్నాయి.
రోబోలు, సాఫ్ట్వేర్లకు కూడా చెదపురుగులు ప్రేరణగా నిలుస్తున్నాయి. ఈ పురుగులు ఏ ప్లానింగూ లేకుండా చెద నిర్మాణాలను నిర్మించుకుంటున్నాయి. ఇదే విధంగా.. చాలా కంపెనీలు తమకు నచ్చిన విధంగా రోబోలను తయారుచేస్తున్నాయి. మొత్తంగా రోబోటిక్స్ రంగం డెవలప్ అవుతోంది. చెదపురులు ఏం చేసినా.. ఓ గ్రూపుగా ఉండి చేస్తాయి. సాఫ్ట్వేర్ డెవలపర్లు కూడా.. గ్రూప్ ఇంటెలిజెంట్ సాఫ్ట్వేర్లను తయారుచెయ్యడమే కాదు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అవి పనిచేసేలా చేస్తున్నారు. ఇలా ఎప్పటికప్పుడు స్వయంగా సరిచేసుకుపోయే విధానం చెదపురుగుల గూళ్లకు ఉంటుంది.