అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజారాత్ దగ్గర తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జూన్ 3 సాయంత్రం నాటికి అది భూమిపైకి వస్తుందంటున్నారు. ఆ సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెబుతున్నారు. ఆ రెండు రాష్ట్రాలతోపాటూ... గోవాలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ముంబైలో కొద్దిపాటి వానలు పడతాయన్నారు. (credit - twitter-ANI)